
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హనీ రోజ్(Honey Rose). మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. హనీ రోజ్ 1991లో కేరళలో జన్మించింది. 2005లో తాను కేవలం 14 ఏళ్ల వయసులో “బాయ్‌ఫ్రెండ్” అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
టాలీవుడ్ ప్రేక్షకులను ఒకే ఒక్క సినిమాతో క్లీన్ బౌల్డ్ చేసిన మలయాళ బ్యూటీ హనీ రోజ్.. బాలకృష్ణ(Balakrishna) సరసన వీరసింహారెడ్డి(Veerasimha reddy) సినిమాలో నటించి తన అందంతో, నటనతో ఇప్పుడు హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అయితే వీరసింహారెడ్డి ఆమె తొలి తెలుగు సినిమా కాదు. 2014లో ఈ వర్షం సాక్షిగా(Varsham Shakshiga) అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ఈ అమ్మడుకి, అప్పుడు అంత గుర్తింపు రాలేదు. బాలయ్య చిత్రంతో మాత్రం ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ఇప్పుడు హనీ రోజ్ సినిమాల కంటే సోషల్ మీడియా, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో బిజీగా ఉంటుంది. తరచూ తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే వీరసింహారెడ్డి తర్వాత ఆమె తెలుగులో కనిపించకపోవడం కొంతమంది ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. అయినప్పటికీ, హనీ రోజ్ తాజా ఫోటోలు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.
View this post on Instagram