బ్రహ్మముడి సీరియల్‌ మానస్ కు ఇన్ని ఆస్తులా ? రెమ్యూనరేషన్ విషయానికొస్తే మతిపోవాల్సిందే..

విశాఖపట్నంలో జన్మించిన మానస్(Maanas), చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినిమాల్లో అడుగుపెట్టి తన నటనను పరిచయం చేశాడు. చదువు పూర్తి అయిన తర్వాత టెలివిజన్ రంగంలో ప్రవేశించి, అనేక సీరియల్స్‌లో నటించాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత టీవీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నాడు. టీవీ సీరియల్స్, సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

బిగ్ బాస్(Bigg Boss) తర్వాత అతనికి అవకాశాలు మరింతగా పెరిగాయి. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ‘బ్రహ్మముడి’ (Brahmamudi)సీరియల్‌లో హీరోగా నటిస్తూ తన ప్రతిభను చాటాడు. ఈ సీరియల్‌లో అతని పాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో పాటు మరికొన్ని సీరియల్స్ మరియు టీవీ షోల్లో, సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మానస్ తన ఆస్తులు, రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

వైజాగ్‌లో తాత, తండ్రుల నుంచి వచ్చిన పొలాలు, ఒక ఇల్లు, హైదరాబాద్‌లో మూడు ఫ్లాట్లు ఉన్నాయని చెప్పాడు. అలాగే ఒక షోకి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఇక సీరియల్స్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.25 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. నెలలో దాదాపు 30 రోజులు బిజీగా ఉండే మానస్, షోలు, ఈవెంట్లు కలిపి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడట.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *