దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలన్నీ ఆధార్ కార్డు(Aadhaar Card)తోనే నడుస్తోంది. నిత్య జీవితంలో ఏ పనికైనా ఆధార్ కార్డే ముల్యం. అయితే ఈ ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయి( Link a New Mobile Number) ఉండకపోతే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఓటీపీలు రాకపోవడం, ఆధార్‌తో ఉన్న బ్యాంకింగ్, రేషన్, పింఛన్ వంటి సేవలు అందని పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డుతో సెల్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రక్రియను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండూ విధాలుగా పూర్తిచేయవచ్చు. ఇప్పుడు ఈ రెండు విధానాల గురించి చూద్దాం:
ఆన్‌లైన్ ద్వారా ఆధార్-మొబైల్ నంబర్ లింక్ విధానం
* ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
* అక్కడ కనిపించే “Book Appointment” అనే ఎంపికపై క్లిక్ చేయాలి.
* ఆపై “Proceed to Book Appointment” పై క్లిక్ చేస్తే ఓ కొత్త పేజీ తెరుచుకుంటుంది.
* ఆ పేజీలో మీ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి “Generate OTP” పై క్లిక్ చేయాలి.
* మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి, “Submit OTP” పై క్లిక్ చేయాలి.
* అనంతరం మీకు అవసరమైన సవరణలు ఎంచుకుని, సంబంధిత సమాచారం పూర్తి చేయాలి.
* చివరగా మీరు ఎంపిక చేసిన తేదీ, సమయానికి ఆధార్ కేంద్రానికి హాజరై మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేయవచ్చు.
ఆఫ్‌లైన్‌లో ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయాలంటే..
* మీ కొత్త మొబైల్ నెంబర్ ను ఆధార్‌కు లింక్ చేయాలంటే ఇలా చేయండి
* మీ సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. (దానికి ముందుగా UIDAI వెబ్‌సైట్ ద్వారా మీ దగ్గరలోని కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.)
* ఆధార్ కేంద్రానికి వెళ్తున్నప్పుడు మీతో పాటు ఈ పత్రాలు తీసుకెళ్లాలి. పాన్ కార్డు, రేషన్ కార్డు లేదా బ్యాంక్ పాస్ బుక్ (ఐడీ ప్రూఫ్)
* చిరునామా రుజువు కోసం విద్యుత్ బిల్లు లేదా (నీటి)నల్ల బిల్లుతో పాటు పాస్ పోర్ట్ సైజు ఫొటోలను తీసుకు వెళ్లాలి. లేకుంటే బ్యాంక్ పాస్ బుక్ అయినా తీసుకు వెళ్లవచ్చు.
* కేంద్రంలో మీకు ఒక అప్లికేషన్ ఫారమ్ ఇస్తారు. దానిని పూర్తిగా ఫిల్ చేసి, అవసరమైన పత్రాల జిరాక్స్‌లను జతచేయాలి. ఆ ఫారమ్‌పై మీ ఫోటో అతికించి, సిబ్బందికి అందజేయాలి. తర్వాత వారు మీకు ఒక అప్‌డేట్ స్లిప్ లేదా ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు. ఈ ట్రాకింగ్ నెంబర్ ద్వారా మీరు ఆధార్‌లో మొబైల్ నెంబర్ ఎప్పటికి అప్‌డేట్ అవుతుందో ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు.






