Mana Enadu : ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరికీ PF ఖాతా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ PF ఖాతాలోకి ప్రతినెలా కొంత డబ్బు కూడా జమవుతూ ఉంటుంది. అయితే అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఆ డబ్బును మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం పీఎఫ్ ఖాతాకు సంబంధించిన UAN(Universal Account Number) ఉండాలి. ఆధార్ కార్డు వివరాలు PF ఖాతాలో నమోదు చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా(Bank Account) వివరాలు కూడా కావాలి.
విత్ డ్రా ప్రాసెస్ ఇలా..
ఇదిలా ఉంటే.. మనీ విత్‌డ్రా కోసం ముందుగా UAN నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి EPFO వెబ్‌సైట్లో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో క్లెయిమ్ ఫారం(Claim form online)ను పూరించి, విత్‌డ్రా చేయాలనుకునే కారణాన్ని ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్(Upload documents) చేసి దరఖాస్తును సబ్మిట్ చేయండి. ఆ దరఖాస్తును EPF అధికారులు పరిశీలిస్తారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే దరఖాస్తును ఆమోదిస్తారు. ఆ తర్వాత PF డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయి.
కొన్ని అవసరాలకు మాత్రమే PF డబ్బును విత్‌డ్రా(Withdraw money) చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఒకవేళ చందాదారునికి లేదా తన కుటుంబసభ్యులకు వైద్యం కోసం అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం కోసం కూడా మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు. చందాదారుడి పెళ్లికి కూడా మనీ విత్‌డ్రాకు అనుమతిస్తారు. పిల్లల చదువు లేదా వివాహం(Education or marriage) కోసం మనీ విత్‌డ్రా చేయొచ్చు.
మొత్తం మనీ విత్ డ్రా చేయలేరు..
ఇటీవల పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్(PF claim settlement) సమయం కూడా తగ్గించారు. కాబట్టి 3 రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు పడతాయి. గరిష్ఠంగా 10 రోజులు కూడా పట్టొచ్చు. అయితే, ఈ కారణాలకు PF ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును చెల్లించరు. కేవలం పాక్షికంగా మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణకు రెండు నెలల ముందు మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్నా PF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉంటూ.. మనీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోరాదు.






