
టాలీవుడ్(Tollywood)లో ఒకప్పుడు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్స్ జెనీలియా డిసౌజా(Genelia D’Souza), లయ(Laya), అన్షు(Anshu) ఇటీవల రీ-ఎంట్రీ ఇచ్చారు. అయితే, వారి కమ్‌బ్యాక్ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ ముగ్గురు నటీమణులు తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్లీ స్టార్‌డమ్ సాధిస్తారని భావించినప్పటికీ వారికి నిరాశే ఎదురయ్యింది. మరి ఈ ముగ్గురు నటించిన తాజా చిత్రాలేంటో ఓ లుక్ వేద్దామా..
జెనీలియా డిసౌజా: ‘బొమ్మరిల్లు(Bommarillu)’ సినిమాతో హాసినిగా గుండెల్లో చెరిగిపోయిన జెనీలియా, దాదాపు దశాబ్దం విరామం తర్వాత ‘వేద్’ సినిమాతో మరాఠీలో, ‘సితారే జమీన్ పర్(Sitare Zameen Par)’తో బాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో ‘జూనియర్(Junior)’ సినిమాతో తిరిగి రాణించాలని భావించింది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. పాత్రల ఎంపికలో జాగ్రత్తలు, ప్రేక్షకుల అంచనాలు తీర్చడంలో సవాళ్లు ఆమె రీ-ఎంట్రీని ప్రభావితం చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లయ: ‘స్వాగతం’, ‘మిస్సమ్మ(Missamma)’, ‘ప్రేమించు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన లయ, లాంగ్ గ్యాప్ తర్వాత తమిళ చిత్రాల్లో కనిపించింది. టాలీవుడ్‌లో ఆమె రీ-ఎంట్రీ ప్రామిసింగ్ పాత్రల కొరత, పోటీ వాతావరణం కారణంగా ఊపందుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో మారిన ట్రెండ్స్, కొత్త తరం నటీమణుల ఆధిపత్యం ఆమె కమ్‌బ్యాక్‌ను సవాలుగా మారింది. తాజాగా ఆమె ‘తమ్ముడు(Thammudu)’తో మెరవగా ఆ మూవీ ఆకట్టుకోలేకపోయింది.
అన్షు: ‘మన్మథుడు’లో నటనతో గుర్తుండిపోయిన అన్షు, చిన్న విరామం తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ, ఆమె కమ్‌బ్యాక్ ఆశించినంత ఆకట్టుకోలేదు. పరిమిత స్క్రీన్ స్పేస్, సరైన అవకాశాల కొరత వంటి అంశాలు ఆమె రీ-ఎంట్రీని బలహీనపరిచాయి. ఇటీవల ఆమె మజాకా(Mazaka) సినిమాతో మరోసారి వెండితెరకు ఎంట్రీ ఇచ్చానా.. ఆ మూవీ కాస్త డీలా పడింది.
దీంతో ఈ ముగ్గురు నటీమణుల రీ-ఎంట్రీ వారితోపాటు ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. ఇందుకు కారణాలూ లేకపోలేదు. మారుతున్న సినిమా ట్రెండ్స్, కొత్త నటీమణుల ఆధిపత్యం, సరైన కథలు, పాత్రల ఎంపికలో సవాళ్లు ప్రతికూలంగా మారాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.