హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం చేసుకొని బోడుప్పల్లో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మహేందర్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్యానంతరం జ్యోతి(Jyothi) శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి వాటిని బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు.


జ్యోతి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
అయితే, గది నుంచి వచ్చిన అనుమానాస్పద శబ్దాలతో పొరుగువారు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఈ దారుణం బయటపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని శరీర భాగాలను మూసీలో పడేశాడు. ఆ శరీర భాగాల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.

శోకసంద్రంలో జ్యోతి కుటుంబ సభ్యులు
ఈ ఘటనతో జ్యోతి తల్లి, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని జ్యోతి తల్లి డిమాండ్ చేస్తోంది. స్థానికులు మహేందర్ ప్రవర్తన వింతగా ఉండేదని స్థానికులు వెల్లడించారు. గతంలోనూ వీరిమధ్య గొడవలు జరుగుతుండేవని తెలిపారు. కాగా ఘటనా స్థలంలో జ్యోతి కొన్ని శరీరభాగాలు, ఒక రంపం, పెద్ద కత్తి, గోనెసంచి, బ్యాగు స్వాధీనం చేసుకున్నారు.







