ManaEnadu: ఎప్పుడూ రద్దీగా తిరిగే హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైళ్లకు సాంకేతిక లోపం(Technical Issue) కారణంగా సోమవారం (నవంబర్ 4) ఎక్కడికక్కడే మెట్రో రైళ్లు ఆగిపోయాయి. నాగోల్-రాయదుర్గం(Nagole-Raidurg), LB నగర్-మియాపూర్(LB Nagar-Miyapur) మార్గంలో అరగంట నుంచి ఎక్కడి ట్రెయిన్స్ అక్కడన నిలిచాయి. టెక్నికల్ ఇష్యూ కారణంతో బేగంపేట మెట్రో స్టేషన్(Begumpet Metro Station)లో దాదాపు 15 నిమిషాల పాటు మెట్రో రైళ్లను ఆపేశారు. అయితే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మెట్రో రైళ్లకు అంతరాయం ఏర్పడలేదు. 10 గంటల నుంచే సాంకేతిక లోపం కారణంగా ఎక్కడికక్కడే పలు రైళ్లు నిలిచిపోయాయని మెట్రో యాజమాన్యం తెలిపింది. దీంతో ఆఫీసులకు వెళ్లే సమయం కావడం, రైళ్లు ఎంతకీ కదలకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
Metro services disrupted for a while in #Hyderabad due to a technical glitch on Monday.
Affected route– & #LBNagar– #Miyapur
Office goers are the worst affected due to the disruption in Metro services.@ltmhyd metro officials said that a technical glitch in… pic.twitter.com/ZzMsc6TSeY
— NewsMeter (@NewsMeter_In) November 4, 2024
ప్రయాణికులకు సారీ చెప్పిన యాజమాన్యం
సాంకేతిక సమస్య(Technical Issue) వల్ల ఆగిపోయిన మెట్రో రైళ్లను కాసేపట్లోనే అధికారులు తిరిగి పరిష్కరించారు. అయితే సాంకేతిక లోపానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మెట్రో ఆగిపోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. చాలా సార్లు ఇలాంటి సమస్యలు తలెత్తాయి. అయిన అధికారులు నిర్లక్ష్యంగా(authorities are negligent)నే వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులు రద్దీ భారీగా పెరిగింది. ఇక అమీర్ పేట్ మెట్రో స్టేషన్(Ameer Pate Metro Station)లో అయితే చెప్పనవసరం లేదు. ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులు ఫ్లాట్ ఫామ్‌లపై నిరీక్షిస్తున్నారు. కాగా సమస్యను పరిష్కరించాకా మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. మరోసారి ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఓ ట్విటర్(X)లో పోస్ట్ చేసింది.
Dear Commuters, thank you for your patience and understanding. We experienced a brief delay on the Blue Line this morning due to a technical issue. We’re pleased to inform you that normal operations have resumed. Thank you for your patience and cooperation and we regret for any… pic.twitter.com/CB3l0YA5a4
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 4, 2024