Uppal:ప్రజల కోసం పనిచేద్దాం..సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్దాం: బండారి

Empally-

ప్రజల కోసం ఐకమత్యంగా పనిచేద్దామని..సంక్షేమమే లక్ష్యంగా మెందుకెళ్దామని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. చర్లపల్లి డివిజన్​ శ్రీమారుతీ ఎంక్లేవ్​ కాలనీ అసోసియోషన్​ భవనంలో ఆదివారం జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య​అతిధిగా పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా మన కాలనీను ఆదర్శంగా నిలుపుకునేందుకు పోటీపడి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి హజరై కాలనీ సమస్యల పరిష్కారం కోసం తాను పనిచేస్తానని హమీనిచ్చారు.వెల్ఫేర్అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ కుటుంబాల భాగస్వామ్యంతో శ్రీ మారుతి ఎంక్లేవ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయనపేర్కొన్నారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గొల్లూరి అంజయ్య,సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS ప్రతినిధులు ఎంపల్లి పద్మా రెడ్డి, గంప కృష్ణ, సారా అనిల్ ముదిరాజ్, కొండగళ్ల అశోక్, సింగిరెడ్డి నరసింహారెడ్డి, బాలాజీ నాయక్, షాబాద్ దామోదర్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, దుర్గారెడ్డి, చలమారెడ్డి లక్ష్మీనారాయణ నరసింహ గౌడ్ శ్రీనివాస్, ఆదిమహావిష్ణు, యాదగిరి పాల్గొన్నారు.

Related Posts

Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *