పేదలకు పంచాల్సిన పీడీఎస్ బియ్యం (PDS Rice) పక్కదారి పడుతున్నట్లు గుర్తించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆ బియ్యాన్ని తరలిస్తున్న షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇటీవల కాకినాడ పోర్టును సందర్శించిన డిప్యూటీ సీఎం.. పోర్ట్ కస్టమ్స్, ఏపీ సివిల్ సప్లయ్ శాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి స్టెల్లా షిప్‌లో తనిఖీలు చేశారు. ఆ షిప్‌లో భారీ మొత్తంలో రేషన్ బియ్యం తరలిస్తుండడాన్ని గుర్తించి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ‘సీజ్ ది షిప్’ (Seize The Ship) అంటూ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారాయి.
పవన్ కల్యాణ్ తనిఖీలు, ఆదేశాలపై తాజాగా తెలంగాణలోని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (hydra commissioner ranganath) స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రంగనాథ్ మాట్లాడుతూ పవన్ చర్యలను స్పందించారు. ‘రేషన్ అక్రమ రవాణాను పవన్ అడ్డుకున్నారు. అలా చూస్తూ ఊరుకుంటే అంతకు మించి అనర్థాలు జరిగే ఛాన్స్ ఉంది. ఇది రైస్ స్మగ్లింగ్‌తో ఆగదు. అంతకు మించి ఇంకా జరగుతా. ఒకసారి మెుదలుపెట్టిన వాడు అన్నింట్లోకి ఎంట్రీ అవుతాడు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సైతం అక్రమ రవాణా జరుగుతాయి’ అలాంటి చర్యలను అడ్డుకోవడం సంతోషంగా ఉందని రంగనాథ్ అన్నారు.
ఆపకపోతే అనర్థాలు జరుగుతాయి
కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించారు. కాగా, గత మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. బుల్డోజర్లకు ఆయా కట్టడాలను కూల్చేశారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. చెరువుల, కుంటల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసినట్లు ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించటమే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు.
ఆ పేరుతో సినిమా టైటిల్
పవన్ కల్యాణ్ ‘సీజ్ ది షిప్’ వ్యాఖ్యలు నెట్టింట బాగా ప్రచారం అయ్యాయి. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చ జరగింది. ఇక పవన్ చేసిన సీజ్ ది షిప్ వ్యాఖ్యలతో ఏకంగా ఓ సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ అయ్యింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ అనే సంస్థ ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకుంది.






