Allu Arjun: గద్దర్ అవార్డ్‌పై బన్నీ ఎమోషనల్.. నా అభిమానులకు అంకితం అంటూ ట్వీట్ 

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డ్స్‌(Gaddar Awards 2024)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. బెస్ట్ లీడింగ్ యాక్టర్(Best Leading Actor), బెస్ట్ ఫిల్మ్, ఉత్తమ నటి సహా మొత్తం 35 కేటగిరీల్లో అవార్డులను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(TFDC) ప్రకటించింది. ఈ మేరకు పుష్ప-2 సినిమాకు గానూ అల్లు అర్జున్‌(Allu Arjun)కు ఉత్తమ నటుడిగా ఎంపికైనట్లు జ్యూరీ వెల్లడించింది. దీంతో అల్లు అర్జున్ సోషల్ మీడియా(SM) వేదికగా స్పందించాడు.

 

ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు

 

‘తొలిసారిగా ప్రవేశ పెట్టిన తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌(Telangana Gaddar Film Awards)ల్లో పుష్ప-2 చిత్రానికి గాను ఉత్తమ నటుడు(Best Actor)గా అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడిట్‌ అంతా డైరెక్టర్ సుకుమార్‌(Director Sukumar), నా నిర్మాతకు, పుష్ప టీమ్‌కే చెందుతుంది. నన్ను ప్రేమిస్తూ, నాకెప్పుడూ సపోర్ట్‌గా నిలుస్తూ, ఎల్లప్పుడూ ఎంతో ఇన్‌స్పయిర్‌ చేసే నా అభిమానుల(Fans)కు ఈ అవార్డును డెడికేట్‌ చేస్తున్నాను’ అని అల్లు అర్జున్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశాడు. ఈ అవార్డును జూన్ 14న బన్నీ అందుకోనున్నాడు. కాగా పుష్ప-2 దాదాపు 1800 కోట్లకు పైగా రికార్డు కలెక్షన్లు(Collections) సాధించి బంపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *