Fahad Fazil: సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్.. అయినా డ్రైవర్‌గా పనిచేస్తానంటున్న స్టార్ హీరో

ఫహాద్ ఫాజిల్(Fahad Fazil).. మలయాళ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. 2002లో “కైయెత్తుం దూరత్తు” చిత్రంతో బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఫహాద్.. తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకుని 2012లో “22 ఫీమేల్ కొట్టాయం(22 Female Kottayam)” చిత్రంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అతని సహజ నటన, విభిన్నమైన పాత్రల ఎంపికలు అతన్ని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. “మహేషింటే ప్రతికారం”, “కుంబళంగి నైట్స్”, “విక్రమ్(Vikram)” వంటి చిత్రాలతో అతను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఫహాద్ నటనతో పాటు నిర్మాతగా కూడా విజయం సాధించాడు. 2016లో నటి నజ్రియా నజీమ్‌ను వివాహం చేసుకున్న ఫహాద్, వారి నిర్మాణ సంస్థ ఫహాద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తున్నాడు. ప్రస్తుతం అతను దక్షిణ భారత సినిమాలో అగ్రగామిగా కొనసాగుతున్నాడు.

From childhood memories to Porsche dreams: Fahadh Faasil opens up about his love for cars

హీరో, నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా..

ఓవరాల్‌గా హీరోగా,నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తూ ఫుల్ బిజీ బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక తెలుగులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ‘పుష్ప(Pushpa)’లో విలన్ పాత్రలో నటించి విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నారు. ఇక ఇటీవల ఫహాద్ ‘మారీశన్(Marrison)’ కామెడీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నాకు చాలా ఇష్టమైన ప్రదేశం బార్సీలోనా. నన్ను బిగ్ స్క్రీన్‌పై ఒక చాల్లే చూడలేకపోతున్నాం అని ప్రేక్షకులు అనుకున్న రోజు అక్కడికి వెళ్లి స్థిరపడతాను.

Fahadh Faasil In Pushpa 2: Is Fahadh Faasil Unhappy With His Role In Allu  Arjun's Pushpa 2: The Rule? Actor's Comment Goes Viral | Times Now

స్పెయిన్‌లోని బార్సీలోనాకు వెళ్లి..

ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్తా. జనాలను గమ్యస్థానాలను తీసుకువెళ్లడం కంటే మంచి విషయం ఏముంటుంది. అది నా దృష్టిలో చాలా గొప్ప పనిగా భావిస్తాను. డ్రైవింగ్(Driving) అంటే నాకు చాలా ఇష్టం. అది నాకు ఎప్పుడూ బోర్ కోట్టదు. కాబట్టి రిటైర్ అయిన తర్వాత స్పెయిన్‌లోని బార్సీలోనాకు వెళ్లి ఐబర్ డ్రైవర్‌గా వర్క్ చేస్తాను. అక్కడి ప్రాంతాలన్నింటినీ చుట్టేస్తూ ప్రజలను తిప్పుతుంటాను. ఈ విషయం నా భార్య నజ్రియా(Nazriya)కు కూడా చెప్తాను. ఆమె దానికి అంగీకరించింది. నాతో పాటు ఉండటానికి’’ అని చెప్పుకొచ్చారు.

Nine years of us': Fahadh Faasil shares heartwarming pic with Nazriya on  anniversary

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *