టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda) గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేదు. ఇండస్ట్రీలోకి(Tollywood) వచ్చి చాలా కాలం అయినా..తనకంటూ హీరోగా మంచి గుర్తు రావడానికి ఆయన ఎంతో శ్రమించారు. వన్స్ క్రేజ్ వచ్చాక అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ప్రస్తుతం విజయ్ క్రేజ్.. దేశదేశాలకు వ్యాప్తిస్తోంది. మన పొరుగుదేశమైన శ్రీలంక(Sri lanka)లో కూడా విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
నాకు విజయ దేవరకొండతో నటించాలని ఉంది- మిస్ శ్రీలంక అనుది గుణశేఖర pic.twitter.com/nkvmBe2yOJ
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2025
ఆ చిత్రంతోనే విజయ్‌కు క్రేజ్..
విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ఇటీవల ‘మిస్ శ్రీలంక అనుది గుణశేఖర’ ఒక సందర్భంలో స్పందించారు. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి నటించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. తాను విజయ్ దేవరకొండ నటనకు వీరాభిమాని అని తెలిపారు. దీంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. విజయ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంతగా ఉందని ఆయన అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా అర్జున్ రెడ్డి సినిమా శ్రీలంకలో బాగా ఆడిన విషయం తెలిసిందే. అందులో విజయ్ నటనకు అక్కడి అభిమానులు ఫిదా అయ్యారు.
మిస్ వరల్డ్ పోటీలకు వచ్చి..
ప్రస్తుతం మిస్ శ్రీలంక అనుది గుణశేఖర (Miss SriLanka Anudi Gunasekara) హైదరాబాద్‌లో ఉన్నారు. అందాల పోటీల్లో(miss World compitations) పాల్గొనేందుకు వచ్చిన ఆమె.. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగులో ఏ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు అనుది గుణశేఖర పై విధంగా స్పందించారు.






