ఇకపై నా చివరి శ్వాస వరకూ అలాగే మాట్లాడుతా: Rajendra Prasad

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ(Telugu Industry)తోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకటే చర్చ నడుస్తోంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendraprasad) రెండ్రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల(Comments)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో రాజేంద్రప్రసాద్ కమెడియన్ అలీ(Ali), నటుడు మురళీ మోహన్(Murali Mohan), సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా(Roja)లపై చేసిన వ్యాఖ్యలపై నెట్టింట జనం ఎండగడుతున్నారు. సీనియర్ నటుడై ఉండి ఇలాంటి పదజాలం ఉపయోగించడమేంటని మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై కమెడియన్ అలీ సున్నితంగానే స్పందించి వీడియో రిలీజ్ చేసినా.. చాలా మంది సీనియర్ నటుడిపై ఫైరయ్యారు. దీంతో రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలపై స్పందించారు.

జరిగినదానికి నేను చాలా హర్ట్ అయ్యా..

‘నా మాట తీరును ‘అలీ’ సీరియస్‌గా తీసుకోలేదు. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని అతను చెప్పాడు కూడా. కానీ ఎవరో ఏదో ఉద్దేశంతో ఈ విషయాన్ని పెద్దది చేయాలనుకుంటే దానికి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇక్కడ మేమంతా ఒకరికొకరం ఎంతో ప్రేమతో ఉంటాం. ఆ మాత్రం సెంటిమెంట్స్(Sentiments) లేకపోతే మేము కలిసి ఇంతదూరం ప్రయాణం చేసే వాళ్లం కాదు కదా. అలీ మళ్లీ నాకు కాల్ చేసి, జరిగింది మరిచిపొమ్మని చెప్పాడు. ఏదేమైనా జరిగినదానికి నేను చాలా హర్ట్ అయ్యాను’ అని అన్నారు.

అలా పిలవడం ఎన్టీఆర్ గారి దగ్గరే నేర్చుకున్నా..

“జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ ‘నువ్వు’ అని సంభోదించను. ఇకపై ఎవరినైనా ‘మీరు’ అనే పిలుస్తాను. అలా పిలవడం నేను NTR గారి దగ్గరే నేర్చుకున్నాను. నేను మాట ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకూ అందరినీ ‘మీరు’ అనే పిలుస్తాను. అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *