
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ఐసీసీ ఈవెంట్(ICC Event) రాబోతోంది. భారత్(India), శ్రీలంక(Srilanka) సంయుక్త వేదికగా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్(ICC Womens ODI World Cup -2025) జరగనుంది. ఈ మేరకు సోమవారం ఐసీసీ షెడ్యూల్(ICC Schedule)ను రిలీజ్ చేసింది. కాగా వరల్డ్ కప్ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరగనుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్థాన్(India vs Pakistan) మ్యాచ్ అక్టోబర్ 5న కొలంబోలో జరగనుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లు అక్టోబర్ 29, 30 తేదీల్లో జరగనున్నాయి. ఫైనల్(Final) మ్యాచ్ నవంబర్ 2న కొలొంబో లేదా బెంగళూరులో జరగనుంది.
మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీ
ఉమెన్స్ వరల్డ్ కప్( Womens ODI World Cup)లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు టైటిల్ కోసం పోటీపడుతాయి. ఇందులో భారత్, శ్రీలంకలోని ఐదు వేదికల్లో హైబ్రిడ్ మోడ్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు ICC తెలిపింది. భారత్‌లోని బెంగళూరు, గౌహతి, ఇండోర్, వైజాగ్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను మాత్రం శ్రీలంకలోని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో నిర్వహించనున్నారు.
🚨IT WILL BE INDIA vs PAKISTAN ON OCTOBER 5, 2025 IN WOMEN’S ODI CWC !!!!!🚨#INDvsPAK #IndiaPakistanWar #Cricket pic.twitter.com/4syKmWjRv6
— 🏏CricketFeed (@CricketFeedIN) June 16, 2025
షెడ్యూల్ ఇదే..
☛ మంగళవారం, సెప్టెంబర్ 30 – భారత్ vs శ్రీలంక-బెంగళూరు-మధ్యాహ్నం 3 గంటలకు
☛ బుధవారం, అక్టోబర్ 1-ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్-ఇండోర్-మధ్యాహ్నం 3 గంటలకు
☛ గురువారం, అక్టోబర్ 2-బంగ్లాదేశ్ vs పాకిస్థాన్-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ శుక్రవారం, అక్టోబర్ 3 – ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా – బెంగళూరు-మధ్యాహ్నం 3 గంటలకు
☛ శనివారం, అక్టోబర్ 4-ఆస్ట్రేలియా vs శ్రీలంక-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ ఆదివారం, అక్టోబర్ 5-భారతదేశం vs పాకిస్థాన్-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ సోమవారం, అక్టోబర్ 6-న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా-ఇండోర్-మధ్యాహ్నం 3 గంటలకు
☛ మంగళవారం, అక్టోబర్ 7-ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్-గువహతి-మధ్యాహ్నం 3 గంటలకు
☛ బుధవారం, అక్టోబర్ 8-ఆస్ట్రేలియా vs పాకిస్థాన్-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ గురువారం, అక్టోబర్ 9- భారత్ vs దక్షిణాఫ్రికా- వైజాగ్- మధ్యాహ్నం 3 గంటలకు
☛ శుక్రవారం, అక్టోబర్ 10-న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్-వైజాగ్-మధ్యాహ్నం 3 గంటలకు
☛ శనివారం, అక్టోబర్ 11 – ఇంగ్లాండ్ vs శ్రీలంక-గౌహతి- మధ్యాహ్నం 3 గంటలకు
☛ ఆదివారం, అక్టోబర్ 12-భారత్ vs ఆస్ట్రేలియా-వైజాగ్-మధ్యాహ్నం 3 గంటలకు
☛ సోమవారం, అక్టోబర్ 13-దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్-వైజాగ్-మధ్యాహ్నం 3 గంటలకు
☛ మంగళవారం, అక్టోబర్ 14-న్యూజిలాండ్ vs శ్రీలంక-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ బుధవారం, అక్టోబర్ 15-ఇంగ్లాండ్ vs పాకిస్థాన్-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ శుక్రవారం, అక్టోబర్ 17-దక్షిణాఫ్రికా vs శ్రీలంక-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ శనివారం, అక్టోబర్ 18-న్యూజిలాండ్ vs పాకిస్థాన్-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ ఆదివారం, అక్టోబర్ 19-భారతదేశం vs ఇంగ్లాండ్-ఇండోర్-మధ్యాహ్నం 3 గంటలకు
☛ సోమవారం, అక్టోబర్ 20-శ్రీలంక vs బంగ్లాదేశ్-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ మంగళవారం, అక్టోబర్ 21-దక్షిణాఫ్రికా vs పాకిస్థాన్-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ బుధవారం, అక్టోబర్ 22-ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్-ఇండోర్-మధ్యాహ్నం 3 గంటలకు
☛ గురువారం, అక్టోబర్ 23- భారత్ vs న్యూజిలాండ్- గౌహతి -మధ్యాహ్నం 3 గంటలకు
☛ శుక్రవారం, అక్టోబర్ 24-పాకిస్థాన్ vs శ్రీలంక-కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ శనివారం, అక్టోబర్ 25-ఆస్ట్రేలియా v శ్రీలంక-ఇండోర్-మధ్యాహ్నం 3 గంటలకు
☛ ఆదివారం, అక్టోబర్ 26-ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్-గువహతి-ఉదయం 11
☛ ఆదివారం, అక్టోబర్ 26-భారత్ vs బంగ్లాదేశ్-బెంగళూరు-మధ్యాహ్నం 3 గంటలకు
☛ బుధవారం, అక్టోబర్ 29-సెమీఫైనల్ 1-గువహతి/కొలంబో-మధ్యాహ్నం 3 గంటలకు
☛ గురువారం, అక్టోబర్ 30-సెమీఫైనల్ 2-బెంగళూరు-మధ్యాహ్నం 3 గంటలకు
☛ ఆదివారం, 2 నవంబర్-ఫైనల్-కొలంబో/బెంగళూరు-మధ్యాహ్నం 3 గంటలకు
The moment we’ve been waiting for! 🏆
The Women’s Cricket World Cup 2025 fixtures are OUT! 🗓🔥@ICC pic.twitter.com/qiAjB9arxI
— BCCI (@BCCI) June 16, 2025