Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా మారి.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప 2 (Pushpa)’ కూడా వస్తున్న విషయం తెలిసిందే.
నవంబర్ 17న ట్రైలర్ ఈవెంట్
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 5వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే పుష్ప-2 గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే?
బన్నీ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్
పుష్ప-2 ట్రైలర్ ఈవెంట్ ను బిహార్ రాజధాని పట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న ఐకానిక్ గాంధీ మైదాన్ (Iconic Gandhi Maidan)లో నిర్వహించనున్నారు. గ్రాండ్గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు ఓ సూపర్ సర్ ప్రైజ్ ఉండనుందట.
బన్నీ స్పెషల్ ఎంట్రీ
ఈ ఈవెంట్ (Pushpa 2 Pre Release Event) లో అల్లు అర్జున్ ఎంట్రీ భారీ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వేదికపైకి అల్లు అర్జున్ గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. దీని కోసం ఇప్పటికే మేకర్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. బన్నీ ఎంట్రీ కోసం ఓ స్పెషల్ వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.






