Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప: ది రూల్’ (Pushpa : The Rule) సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాలో పుష్ప రాజ్ చేసిన సందడికి యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప – ది రూల్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలు అప్డేట్స్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచేశాయి.
ఐదేళ్ల అద్భుతమైన జర్నీ
తాజాగా పుష్ప-2 నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగు తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్ప రాజ్ అలియాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. ” లాస్ట్ డే షూటింగ్. ఐదేళ్ల ‘పుష్ప’ ప్రయాణం పూర్తయింది. ఇది ఎంతో అద్భుతమైన ప్రయాణం.” అంటూ బన్నీ ఓ ఎమోషనల్ నోట్ (Allu Arjun Tweet) షేర్ చేసి షూట్‌కు సంబంధించిన ఓ ఫొటోను కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రస్తుతం బన్నీ పోస్టు బాగా వైరల్ అవుతోంది.
LAST DAY LAST SHOT OF PUSHPA . 5 years JOURNEY of PUSHPA completed . What a journey pic.twitter.com/eQoRhcLFMQ
— Allu Arjun (@alluarjun) November 26, 2024
పుష్ప-2 రన్ టైమ్ ఎంతంటే?
మరోవైపు ‘పుష్ప 2’ రన్‌టైమ్ (Pushpa 2 Run Time) గురించి కూడా నెట్టింట ఓ అప్డేట్ బాగా చక్కర్లు కొడుతోంది. సెకండ్ పార్ట్ రన్ టైమ్ పార్ట్ 1 కంటే ఎక్కువగా ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పుష్ప – ది రూల్ మూవీ దాదాపు 3 గంటల 21 నిమిషాల నిడివితో ఉండనున్నట్లు సమాచారం. ‘పుష్ప 2’ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
మరోసారి శ్రీవల్లిగా రష్మిక
ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మరోసారి శ్రీవల్లిగా మెప్పించనుంది. మాలీవుడ్ స్టార్ హీరో ఫాహాద్ ఫాజిల్, సీనియర్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్, నవీన్ ఈ సినిమాకు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






