Telangana : రాబోయే ఐదు రోజులు జాగ్రత్తగా ఉండండి

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో చలి తీవ్రత (Telangana Weather News) విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుందని.. ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు ఉంటాయని పేర్కొంది.  హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాల్లో 7-9 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మిగితా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

తెల్లవారుజాము ప్రయాణాలొద్దు

తెల్లవారుజాము ప్రయాణాలు మానుకోవాలని వాతావరణ శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా తెలిపారు. పొగమంచు అధికంగా కురుస్తున్నందున రహదారి కనిపించక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. అత్యవసరం అయితే తప్ప తెల్లవారుజాము ప్రయాణాలు చేయొద్దని సూచించారు. ఒకవేళ చేయాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు పాటించాలని.. హెడ్ లైట్స్ ఆన్ చేసుకుని.. మీడియమ్ స్పీడుతో వెళ్లాలని చెప్పారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *