
భారత్(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374 మంది ప్రాణాలు వదిలారని తెలిపింది. మరో 1287 మంది భారీ వర్షాలు, వరదల వల్ల మృతి చెందారంది. అలాగే 459 మంది వేడిగాలుల వల్ల కన్నుమూశారని, మిగిలిన వారు ఇతరాత్ర కారణాలతో ప్రాణాలు కోల్పోయారని వాతావరణశాఖ(IMD) రిపోర్టు వెల్లడించింది.
బిహార్, కేరళలోనే అధిక మరణాలు
ఇందులో ఉరుములు, మెరుపుల వల్ల బిహార్(Bihar)లో అధిక మరణాలు సంభవించగా.. వరదలు, భారీ వర్షాలు వల్ల కేరళ(Kerala)లో అత్యధిక మంది మృత చెందారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రం వరదల ప్రభావం తీవ్రంగా ఎదుర్కొంది. వరదల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవడం, నదీ ప్రవాహాలను నియంత్రించడానికి ప్రణాళికాబద్ధమైన అడుగులు అవసరని పర్యావరణ నిపుణులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు(High temperatures) ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. గత ఏడాది అత్యధిక ఉష్ణ సంవత్సరంగా నమోదవడంతో, వడదెబ్బ(Sunburn) మరణాలకు కారణమైందని చెప్పవచ్చు.
ఈ రాష్ట్రాలలో పెరిగిన ఉష్ణోగ్రతలు
ఇదిలా ఉండగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, బిహార్, APలోని రాయలసీమలో సగటు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు IMD నివేదిక పేర్కొంది. ఇది దాదాపు ఒక డిగ్రీ సెల్సియస్ సాధారణం కంటే ఎక్కువగా ఉందంది. ఇవన్ని గత ఏడాది జాతీయ సగటు వార్షిక వేడి ఉష్ణోగ్రత(National average annual heat temperature)ల కంటే అధికమని తెలిపింది. తాజా నివేదిక ప్రకారం బిహార్, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో ఎక్కువ మంది మరణించారు.