Mana Enadu : ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDb) ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా దేశంలో మోస్ట్ పాపులర్ సినిమాల సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా మోస్ట్ పాపులర్ విభాగంలో టాప్ టెన్ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. ఈ లిస్టులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898 ఏడీ సినిమా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక బీ టౌన్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన స్త్రీ-2 రెండో స్థానం దక్కించుకుంది. టాప్ టెన్ లో ఉన్న సినిమాలు ఏవంటే..
కల్కి 2898 ఏడీ

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD Movie)’ సినిమా ఈ ఏడాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.1300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
స్త్రీ 2
కల్కి మూవీ తర్వాత ఈ ఏడాది మోస్ట్ పాపులర్‌గా నిలిచిన మూవీ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు నటించిన ‘స్త్రీ 2’(Stree 2). అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.880 కోట్ల వసూళ్లు రాబట్టింది.
From exciting new seasons to fresh entries that captured your attention, here are the Most Popular Indian Web Series of 2024! 💛
Which one was your favorite? pic.twitter.com/h2lET73Knx
— IMDb India (@IMDb_in) December 11, 2024
మహారాజ
తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహారాజ (Maharaja). ఈ మూవీ రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో మూడో స్థానం దక్కించుకుంది.
షైతాన్
అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘షైతాన్ (Shaitan). వికాస్ బెహల్ తెరకెక్కించిన ఈ సినిమా 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది.
ఫైటర్

గ్రీక్ గాడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) , దీపికా పదుకొనే నటించిన మూవీ ఫైటర్ (Fighter). సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో ఐదో స్థానం దక్కించుకుంది.
మంజుమ్మెల్ బాయ్స్
సర్వైవర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘మంజుమ్మెల్ బాయ్స్'(Manjummel Boys) రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో ఆరో స్థానంలో నిలిచింది.
భూల్ భులయ్యా 3
కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా (Bhool Bhulayya) ఇది. ఈ మూవీ 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో ఏడో స్థానంలో నిలిచింది.
కిల్
లక్ష్ లాల్వానీ (Lakshya), తాన్య మనక్తిలా (Tanya Maniktala), రాఘవ్ జుయల్ (Raghav Juyal) ప్రధాన పాత్రల్లో నటించిన కిల్ వి 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
సింగం ఎగైన్
అజయ్ దేవగణ్, కరీనా కపూర్ నటించిన మూవీ సింగం ఎగైన్ (Singham Again). రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో 9వ స్థానం దక్కించుకుంది.
లాపతా లేడీస్

ఆమీర్ ఖాన్ (Aamir Khan) నిర్మాణంలో ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies). ఈ మూవీ 2024 ఐఎండీబీ మోస్ట్ పాపులర్ సినిమా విభాగంలో ‘లాపతా లేడీస్’ పదో స్థానంలో నిలిచింది.






