
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్ సహా పలు దేశాలకు షాకిచ్చారు. దశాబ్దాలుగా ఇతర దేశాలు తమపై సుంకాల(Tariffs)ను విధిస్తున్నాయన్న ట్రంప్.. అదే తరహాలో ఆ దేశాలపైనా ప్రతీకార సుంకాన్ని విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అమెరికాపై సుంకాలు విధించే దేశాల జాబితాను ఆయన విడుదల చేశారు. EU, చైనా, బ్రెజిల్, భారత్(India), మెక్సికో, కెనడా దేశాలు చాలా ఎక్కువగా సుంకాలు వసూలు చేస్తున్నాయని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. అందుకు తగ్గట్లే ఈ దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు(Retaliatory Tariffs) అమలు చేస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు.
రెండు సార్లు ఇండియా పేరు ప్రస్తావన
ఈ క్రమంలో రెండు సార్లు ఇండియా పేరును ట్రంప్ ప్రస్తావించారు. భారత దేశం మనపై 100శాతానికిపైగా ఆటో టారిఫ్‌లు విధిస్తుందని గుర్తు చేశారు. అలాగే అమెరికా(USA) నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై చైనా సగటు సుంకం అమెరికా కంటే ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువ. ఇంకా దక్షిణ కొరియా(South Korea)కు సైనికపరంగా, అనేక ఇతర విధాలుగా చాలా సహాయం అందిస్తున్నామని ట్రంప్ అన్నారు.
తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్‌లో
అలాగే రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చేస్తున్న సంస్కరణల(Reforms)పై వివరించారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఆరు వారాల్లో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల(Executive orders)పై సంతకాలు చేశానని, మరో 400 క్యానిర్వాహక చర్యలు(Administrative actions) చేపట్టినట్లు ట్రంప్ వెల్లడించారు. US అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్(Joint Session of Congress)లో ప్రసంగించారు.
BREAKING NEWS ❗🚨
Trump has announced massive tariffs on India from 2nd April which will affect the economy and market 👇👇
Not a single word by Narendra Modi on this issue, not a single debate by Godi Media 🤯@narendramodi IS A WEAK PRIME MINISTER https://t.co/NZ7cQoV3qY pic.twitter.com/XydshPPi6J
— AI Vanguard (@YsJaganTweets) March 5, 2025