Kalthi Kallu Incident: కల్తీ కల్లు ఘటన.. 44కి చేరిన బాధితుల సంఖ్య

హైదరాబాద్‌(Hyderabad)లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు(Kalthi Kallu) తాగి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరగా, ఇప్పటివరకు ఆరుగురు మృతి(Six Died) చెందినట్లు తెలుస్తోంది. మృతులు స్వరూప (56), తులసిరామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65), మౌనిక (25), నారాయణ (42)గా గుర్తించారు. హెచ్‌ఎంటీ హిల్స్‌, సాయిచరణ్ కాలనీకి చెందిన బాధితులు వాంతులు(Vomiting), విరేచనాల(Diarrhea)తో ఆసుపత్రుల్లో చేరారు. ప్రస్తుతం 31 మంది నిమ్స్‌(NIMS)లో, ఇతరులు గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో చికిత్స పొందుతున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ(Telangana Health Department) మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈరోజు ఆయన ఎక్సైజ్ శాఖ(Excise Department) మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితులను పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Kalthi Kallu | కల్తీ కల్లు తాగి పలువురికి అస్వస్థత - Akshara Today

ఐదు కల్లు కాంపౌండ్‌లను సీజ్

అలాగే ఘటనకు కారణమైన ఐదు కల్లు కాంపౌండ్‌(Kallu Compound)లను సీజ్ చేసినట్లు తెలిపారు. బాలానగర్, కూకట్‌పల్లి, KPHB పోలీస్ స్టేషన్‌లలో 8 కేసులు నమోదయ్యాయి. నగేష్, శ్రీనివాస్, కుమార్, రమేశ్‌తో సహా ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్తీ కల్లు నమూనాలను ల్యాబ్‌(Lab)కు పంపి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం(Compensation) అందించాలన్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *