
కొత్త ఆదాయ పన్ను బిల్లు(New Income Tax Bill)పై నేడు (ఫిబ్రవరి 7) కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఈనెల ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 ఏడాదికిగానూ కేంద్ర బడ్జెన్(Central Budget)ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును తీసుకురానున్నట్లు ప్రకటించాంరు. ఆ ప్రకటనకు సంబంధించి కాసేపట్లో క్యాబినెట్ సమావేశం(Cabinate Meeting) కానుంది. వచ్చే వారం పార్లమెంటులో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్రం రెడీ అవుతోంది.కాగా ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురానున్నట్లు కేంద్రం వెల్లడించింది.
అదనపు పన్నుల భారం తీరనుందా?
అయితే కొత్త ఆదాయపు పన్ను బిల్లులో దీర్ఘ వాక్యాలు, నిబంధనలు, వివరణలు ఉండవని ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే(Finance Secretary Tuhin Kant Pandey) అన్నారు. నేడు జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కొత్త బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో, ఆదాయపు పన్ను రేట్లు, స్లాబ్‌లు మరియు TDS నిబంధనలలో ఇటీవలి మార్పులు కూడా ఇందులో ప్రతిబింబిస్తాయని పాండే చెప్పారు. అదనపు పన్నుల భారం కూడా ఉండబోదని స్పష్టం చేశారు.
25 బేసిస్ పాయింట్లు తగ్గిన రెపోరేటు
ఇదిలా ఉండగా ద్రవ్యపరపతి విధాన సమీక్ష(Monetary policy review) నిర్ణయాల్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా(RBI Governor Sanjay Malhotra) వెల్లడించారు. రెపోరేటు(Repo rate)ను 25 బేసిస్ పాయింట్ల మేర కత్తిరించింది. 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించింది. 2024, ఫిబ్రవరి 8 నుంచి వడ్డీరేట్లు(Interest rates) 6.50% వద్దే గరిష్ఠంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.