గత ఏడాది టెస్టు(Test Cricket)ల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 11 మంది ఆటగాళ్ల లిస్టును ICC ప్రకటించింది. ‘Test Team of the Year’ అనే పేరుతో జాబితాను విడుదల చేసింది. అయితే ఆ లిస్టులో టీమిండియా(Team India) నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్(Yashaswi Jaiswal), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఈ స్క్వాడ్‌లో ఉన్నారు. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్(Pat Cummins) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా గతేడాది జరిగిన మొత్తం 13 టెస్టుల్లో బుమ్రా ఏకంగా 71 వికెట్లు సాధించాడు.
జట్టులో యశస్వీ.. జడ్డూకు స్థానం
ఇక భారత యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ గతేడాది మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 1478 పరుగులు రాబట్టాడు. గతేడాది ఇంగ్లండ్(ENG)తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఈ కుర్రాడు మొత్తం 712 పరుగులు చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(BGT)లోనూ జైస్వాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్(Joe Root) మాత్రమే యశస్వీ కంటే ముందు వరుసలో ఉన్నాడు. రూట్ 17 మ్యాచ్‌లు ఆడి 1556 రన్స్ చేశాడు. ఇక టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి ‘ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్’ లిస్ట్‌లో నిలిచాడు. 2024లో 527 పరుగులు చేసిన జడేజా.. 48 వికెట్లు సాధించాడు.
ICC Test Team-2024 ఇదే
యశస్వీ జైస్వాల్(IND),
బెన్ డకెట్(ENG),
కేన్ విలియమ్సన్(NZ),
జో రూట్(ENG),
హారీ బ్రూక్(ENG),
కమిందు మెండిస్(SL),
జమీ స్మిత్(వికెట్ కీపర్)(ENG),
రవీంద్ర జడేజా(IND),
పాట్ కమిన్స్(AUS)(కెప్టెన్),
మ్యాట్ హెన్రీ(NZ),
జస్ప్రిత్ బుమ్రా(IND)
ఇదిలా ఉండగా వన్డే-2024 జట్టుకు సంబంధించి ప్రకటించిన జట్టులో ఒక్క టీమ్ఇండియా ప్లేయర్ లేకపోవడం గమనార్హం.
Congratulations to the incredibly talented players named in the ICC Men’s Test Team of the Year 2024 👏 pic.twitter.com/0ROskFZUIr
— ICC (@ICC) January 24, 2025






