క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 10 నుంచి ఏషియా కప్‌లో 17వ ఎడిషన్ మొదలవుతుంది. ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 8 టీమ్‌లు బరిలోకి దిగుతాయని తెలుస్తోంది. గతంలో ఏషియా కప్ నుంచి భారత్ తప్పుకుంటుందని చాలా వార్తలు వచ్చాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన సంఘటనల కారణంగా బీసీసీఐ ఏషియా కప్ నుంచి వెనక్కి తగ్గుతుందని కూడా రిపోర్టులు వచ్చాయి. మరోవైపు, పాకిస్థాన్‌ను పక్కనపెట్టి, భారత టీమ్‌ను మాత్రమే కలిపి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏషియా కప్‌ను నిర్వహిస్తుందని కూడా వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పుడు రాబోయే టోర్నమెంట్‌లో రెండు జట్లు బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
హైబ్రిడ్ మోడల్‌లోనే ఇండియా-పాక్ మ్యాచ్‌లు!
ఈసారి ఏషియా కప్ భారత్‌లోనే జరగనుంది. అయితే, భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ టీమ్ కొంచెం వెనుకడుగు వేయొచ్చు. దీనికి ఒక కారణం ఉంది. గతసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరిగినప్పుడు, అక్కడ ఆడేందుకు భారత్ వెనుకడుగు వేసింది. అప్పుడు ఐసీసీ ఆ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించింది. అంటే, పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో ఆడాల్సి వచ్చింది. ఆ సమయంలో బీసీసీఐ, పీసీబీ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు జట్ల మధ్య మ్యాచ్‌లను తటస్థ మైదానాల్లోనే నిర్వహించాలి. అందుకే, గత ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది.
🚨 REPORTS 🚨
The Asia Cup 2025 is likely to begin in the second week of September.IndianSportsFans
18:17 HRS#T20WorldCup2024 #ViratKohli𓃵 #RohitSharma𓃵 #cricketwitter #IndianCricketTeam #T20WorldCup #Trending #TwitterTrends #AsiaCup2025 pic.twitter.com/6nWOvQugBd— Indian Sports Fans. Fan Curated & Original (@IndianSportFan) June 29, 2025
ఈ సారి టోర్నీలో 8 జట్లు
కాబట్టి, ఈ ఏషియా కప్‌ను కూడా బీసీసీఐ హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాల్సి రావచ్చు. అంటే, పాకిస్థాన్ టీమ్ మ్యాచ్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాగా ఈసారి భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, హాంగ్‌కాంగ్ జట్లు తలపడనున్నాయి. కాగా ఈసారి ఏషియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఏషియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. పూర్తి షెడ్యూల్ త్వరలోనే ఏసీఏ ప్రకటించనుంది.







