భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు(India-Pakistan War Situations) కమ్ముకున్న వేళ దాయాది దేశం కీలక ప్రకటన చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్, పాక్ మధ్య పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఇరుదేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధించుకుంటున్నాయి. దేశ సరిహద్దు(Border)ల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నాయి. అటు క్షిపణుల ప్రయోగం(Missile launch)తో బార్డర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను పాక్ ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పలు ఆంక్షలు అమలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
Pakistan Cites Right To Suspend “All Bilateral Pacts, Including Simla”https://t.co/JhfD6XXi9s via @ndtv pic.twitter.com/f8bxdFIdGU
— Debanish Achom (@debanishachom) April 24, 2025
సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్
దశాబ్దాల నాటి ద్వైపాక్షిక సంబంధాలను నిర్వచించిన చారిత్రక సిమ్లా ఒప్పందాన్ని(The Simla Agreement) సస్పెండ్ చేస్తున్నట్లు పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామాబాద్ పేర్కొంది. 1971 నాటి ఇండో-పాక్ యుద్ధం అనంతరం ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. అలాగే వాఘా-అట్టారి బార్డర్(Wagah-Attari Border)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్స్‌కు సార్క్ వీసాలు(SAARC VISA’s) రద్దు చేసింది. అలాగే భారత్‌తో అన్ని వ్యాపార సంబంధాలు(Business Relations) తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. తక్షణమే పాక్‌లోని భారతీయులు వెనక్కి వెళ్లాలని ఆదేశించింది.
Pakistan has suspended the 1972 Simla Agreement after the Pahalgam attack, putting the sanctity of the Line of Control (LoC) in Kashmir under serious strain. Simla agreement is one of the key agreements b/w India and Pakistan. #SimlaAgreement 🇮🇳⚔️🇵🇰 pic.twitter.com/UbOrtSdEkQ
— Defence Dice (@DefenceDice) April 24, 2025
భారత విమానాలపై ఆంక్షలు
అలాగే భారత విమానాలు(Flights) పాక్ గగనతం మీద నుంచి వెళ్లరాదని ఆంక్షలు విధించింది. సింధూ నదీ జలలా(The waters of the Indus River)ను ఆపడం ఒకవిధంగా యుద్ధం ప్రకటించడమే అని పాక్ విదేశాంగ శాఖ(Pakistan Foreign Ministry) పేర్కొంది. ఇక భారత్‌తో యుద్ధం వస్తే దేనికైనా సిద్ధంగా ఉండాలని పాక్ ఆర్మీ(Pak Army)కి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సైనికులకు సెలవులు రద్దు చేసింది. అలాగే సెలవుల్లో ఉన్నవారిని ఉన్నపళంగా రప్పిస్తోంది. ఇదిలా ఉండగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత నేవీ అప్రమత్తమైంది. అరేబియా సముద్రంలో సూరత్‌తీరంలో గైడెడ్ మిస్సైల్ డైస్ట్రాయర్ ప్రయోగా(Guided Missile Destroyer launch)న్ని విజయవంతంగా చేపట్టింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్(INS Vikranth)పై చేపట్టిన ఈ స్కిమ్మింగ్ ప్రయోగంతో పాక్‌తో గట్టి హెచ్చరికలు పంపింది.








