Mana Enadu: న్యూజిలాండ్ మహిళల(New Zealand Women)తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను భారత్ మహిళల(India Women) జట్టు కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఇవాళ జరిగిన కీలక మ్యాచ్లో టీమ్ఇండియా(Team India) చెలరేగి ఆడింది. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 44.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) సూపర్ సెంచరీ (100)తో రాణించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (59*) హాఫ్ సెంచరీకి తోడు షెఫాలీ వర్మ 12, యస్తికా 35, జెమీమా రోడ్రిగ్స్ 22 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో రోవ్ 2, సోఫీ, జానస్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
టాస్ నెగ్గినా.. బ్యాటర్లు విఫలం
అంతకుముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్(New Zealand) 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో జార్జియా 39, బ్రూక్ 89, గాజా 25, తుహుహు 24 పరుగుల చేయగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తిశర్మ 3, ప్రియా మిత్ర 2, రేణుక, సైమా చెరో వికెట్ పడగొట్టారు. కాగా తొలి వన్డేలో భారత్ నెగ్గగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందింది. కీలకమైన మూడో వన్డేలో భారత్ నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది.
𝙏𝙝𝙖𝙩 𝙬𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜! 🤩
Captain @ImHarmanpreet receives the @IDFCFIRSTBank Trophy 🏆#TeamIndia win the #INDvNZ ODI series 2-1 💪
Scorecard ▶️ https://t.co/B6n070iLqu pic.twitter.com/a7lJqrBSzA
— BCCI Women (@BCCIWomen) October 29, 2024








