ఇంగ్లండ్(England)తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలిన విషయం తెలిసిందే. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ 26 పరుగులతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 171/9 రన్స్ చేయగా.. సూర్య సేన ఓవర్లన్నీ ఆడి 145/9కే పరిమితమైంది. దీంతో ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్ ఓడినా 5 వికెట్లతో రాణించిన భారత బౌలర్ వరుణ్ చక్రవర్తికి(Varun Chakravarthi) ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అయితే ఈ మ్యాచులో జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.
గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతోనే..
గత రెండు మ్యాచుల్లాగానే టాస్ నెగ్గిన భారత కెప్టెన్ సూర్య(SKY) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లు బౌలర్లూ రాణించారు. కానీ బ్యాటింగ్ విషయంలోనే యంగ్ ప్లేయర్లు తడబడ్డారు. అందుకుతగ్గట్లు కోచ్ గంభీర్ (Gambhir)నిర్ణయాలు మనం ఓడిపోవడానికి కారణమయ్యాయని సోషల్ మీడియా(SM)లో అభిమానులు మండిపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతోనే జట్టుకు నష్టం జరిగిందని అంటున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆరో వికెట్‌గా రావాల్సిన ధ్రువ్ జురెల్(Dhruv Jurel)ను ఎనిమిదో వికెట్‌కు పంపడమేంటని ప్రశ్నిస్తున్నారు. జురెల్ కంటే ముందొచ్చిన సుందర్ 15 బంతులు ఎదుర్కొని కేవలం 6 రన్స్ మాత్రమే చేశాడు. ఆ తర్వాత అక్షర్(Axar Patel)ను పంపగా అతనూ 16 బంతుల్లో 15 రన్స్ చేసి నిరాశపర్చాడు. దీంతో అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ పెరగడంతో తర్వాతి ప్లేయర్లపై ఒత్తిడి పెరిగిందని దీంతోనే భారత్ ఓడిందని కోచ్ గంభీర్‌పై మండిపడుతున్నారు.
🚨 WHAT A BLUNDER 🚨
Sent Washington Sundar at No. 6, he scored 6 in 15 balls while chasing 172, whereas you were playing Dhruv Jurel as a pure batter and sent him at No. 8, when you had already lost the match. 🤦🏻♂️ pic.twitter.com/MqiBEUYivK
— Vishal. (@SPORTYVISHAL) January 28, 2025
కొనసాగుతున్న SKY పేలవ ప్రదర్శన
ఇదిలా ఉండగా మ్యాచులోనూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(SKY) పేలవ షాట్ ఆడి నిరాశపర్చాడు. సూర్య గత 10 T20ల్లో కేవలం 172 పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. దీంతో SKYపైనా విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్సీ(Captancy) రాగానే ఆటపోయిందంటూ మాజీలు, అభిమానులు విమర్శిస్తున్నారు. తర్వాతి మ్యాచుల్లోనైనా సూర్య రాణించాలని, లేకపోతే భారత్‌కు కష్టమవుతుందంటున్నారు. కాగా ఇరుజట్ల మధ్య నాలుగో మ్యాచ్ ఈనెల 31న పుణే(Pune) వేదికగా జరగనుంది.








