ManaEnadu: భారత్‌కు శుభవార్త. ఒలింపిక్స్ క్రీడలు(Olympics Games) నిర్వహించేందుకు ఆతిథ్య హక్కుల(Hosting rights)ను సొంతం చేసుకుంది. ఈ మేరకు 2036లో భారత్‌లో ఒలింపిక్స్ సమ్మర్ గేమ్స్(Olympics Summer Games) నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (International Olympic Committee) నిర్ణయించింది. తాజాగా దానిని అధికారికంగా ప్రకటిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (Indian Olympic Association)కి అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్(Letter of Intent)ను సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై IOC ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించకపోగా పాజిటీవ్‌గా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.
మొదటి దశ చర్చలు షురూ
ఈ మేరకు ఉపఖండంలో ఒలింపిక్స్, పారాలింపిక్స్(Olympics, Paralympics) క్రీడలకు ఆతిథ్యం దక్కడం విశేషం. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఫ్యూచర్ హోస్ట్ కమిషన్(Future Host Commission)తో 2036 సమ్మర్ గేమ్స్ ఆతిథ్య హక్కులను భారత్‌కు దక్కేలా మొదటి దఫా చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే భారత్ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పదే పదే నొక్కి చెప్పారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఇది తమ ప్రధాన లక్ష్యమని, ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. 2036 ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావాలంటూ పిలుపునివ్వడం విశేషం.
అన్ని ప్రయత్నాలు చేస్తాం: మోదీ
‘ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం ఇండియన్స్ ఉత్సాహంగా ఎదరుచూస్తున్నారు. 140 కోట్ల భారతీయుల కల. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఏ విషయంలో వెనక్కి తగ్గం. 2029 యూత్ ఒలింపిక్స్‌ను సైతం నిర్వహించేందుకు మేం రెడీగా ఉన్నాం’ అని మోదీ అన్నారు. ఇదిలా ఉంటే 2028 లాస్ ఏంజిలెస్, 2032 బ్రిస్బేన్‌లో ఒలింపిక్స్ వేదికలు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే అందరి దృష్టి 2036పై ఉండగా 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ రేసులో ఉందని భారత ఒలింపిక్ కమిటీ గతంలో వెల్లడించింది. 2025లో ఐఓసీ అధ్యక్ష ఎన్నికల(IOC presidential election) తర్వాత 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.








