ఇరాన్ మిలటరీ బేస్ క్యాంపులు(Military base camps), చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్(Israel) భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులతో టెహ్రాన్‌లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్(Iran)లో 600 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు(Human rights groups) తెలిపాయి. దాదాపు 1400 మంది గాయపడినట్లు తేలింది. మృతుల్లో 239 మంది టెహ్రాన్ పౌరులు,126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ఇజ్రాయెల్-ఇరాన్(Israel-Iran War) మధ్య పరస్పర క్షిపణి దాడులు(Missile attacks) కొనసాగుతున్నాయి.

ఇరాన్ నుంచి భారత్ చేరుకున్న 110 మంది విద్యార్థులు
ఇక మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరుల(Indian citizens)ను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘Operation Sindhu’ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా 110 మంది భారతీయ పౌరులతో కూడిన తొలి విమానం ఈరోజు (జూన్ 19) ఉదయం ఢిల్లీకి చేరుకుంది. వీరిలో 90 మంది జమ్మూకశ్మీర్(J&K)కు చెందిన విద్యార్థులు(Students) ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 6E-9487 స్పెషల్ ఫ్లైట్లో వీరంతా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్(External Affairs Kirti Vardhan Singh) స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి విద్యార్థులు, ఇతర పౌరులకు స్వాగతం పలికారు.
VIDEO | Operation Sindhu: The first flight carrying 110 Indian students, who were evacuated to Armenia from war-torn Iran, landed in Delhi in the early hours on Thursday.
“The government… (Indian) Embassy helped us a lot. Thank you,” says a student.
(Full video available on… pic.twitter.com/NJ9c1UPTrs
— Press Trust of India (@PTI_News) June 19, 2025






