ఏజ్ పెరిగినా తమలో ఏమాత్రం సత్తా తగ్గలేదని చూపించారు మాజీ క్రికెటర్లు.. ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మాజీ క్రికెటర్లతో కలిసి ‘ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20(IML T20)’ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ లీగ్ తొలిసీజన్ విజేతగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) సారథ్యంలోని ఇండియా మాస్టర్స్(India Masters) నిలిచింది. వెస్టిండీస్ మాస్టర్స్(West Indies Masters)తో రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో ఇండియా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.
ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించిన సచిన్
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రియాన్ లారా(Brian Lara) సారథ్యంలోని వెస్టిండీస్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులే చేసింది. ఆ జట్టులో సిమ్మన్స్ (57) టాప్ స్కోరర్ కాగా డ్వేన్ స్మిత్ (45) రాణించాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఇండియా 17.1 ఓవర్లలోనే ఛేదించింది. వికెట్ కీపర్ బ్యాటర్ అంబటి రాయుడు (50 బంతుల్లో 74, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సచిన్ (18 బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్స్) తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. గుర్ కీరత్ సింగ్ (14) చేయగా.. చివర్లో యువీ (13 నాటౌట్), బిన్నీ (16 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేశారు. వెస్టిండీస్ బౌలర్లలో అష్లే నర్స్ 2 వికెట్లు తీశాడు. టినో బెస్ట్, బెన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంబటి రాయుడుకి ‘Man of the Match’గా అవార్డు దక్కింది.
𝐓𝐡𝐞 𝐌𝐨𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐓𝐫𝐢𝐮𝐦𝐩𝐡! 🏆🤩#IndiaMasters take the crown! 👑 A memorable final against West Indies Masters 👏#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/1OguKZTRpM
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 16, 2025






