World Bank: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాక్‌పై భారత్ నలువైపులా మూకుమ్మడిగా దాడి కొనసాగిస్తూనే ఉంది. మొన్నటివరకు సైనిక పరంగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindhur)తో పాక్ ను ముప్ప తిప్పలు పెట్టిన భారత్… ఇప్పుడు ఆ దేశానికి ఆర్థిక సాయం అందించొద్దని వరల్డ్ బ్యాంకును కోరుతోంది. పహెల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం పాక్ పై ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధు నది జలాలను పాక్ కు వెళ్లకుండా అడ్డుకుంది. ఆపరేషన్ సింధూర్ తో 11 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేయడమే కాకుండా మళ్లీ ఉగ్ర దాడి జరిగితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
ఆర్థిక సంస్థలను కలవాలని భారత్ నిర్ణయo
ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్, (FATF) (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) వంటి ఆర్థిక సంస్థలను కలవాలని భారత్ యోచిస్తోంది. జూన్‌లో వరల్డ్ బ్యాంక్ పాకిస్తాన్‌కు 20 బిలియన్ యూఎస్ డాలర్ల ప్యాకేజీ మంజూరు చేసే అవకాశం ఉంది. దీనిపై పునరాలోచన చేయాలని ప్రపంచ బ్యాంకు (World Bank)ను భారత్ కోరనుంది. 2018లో FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ) గ్రే లిస్ట్‌లో చేరిన పాక్, 2022లో ఉగ్రవాదాన్ని కట్టడి చేశామని ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసి నిర్బంధించామని చెప్పి లోన్ తీసుకోనుంది. దీంతో వరల్డ్ బ్యాంకు అప్పు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు భారత్ భావిస్తోంది. తాజా పరిణామాల దృష్ట్యా పాకిస్థాన్ కు అప్పు ఇవ్వకుండా ఆపాలని భారత్ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది.
గ్రే లిస్టులో మళ్లీ చేర్చాలి
పాకిస్థాన్ ను మళ్లీ గ్రే లిస్టులో చేర్చాలని భారత్ ఒత్తిడి తెస్తోంది. గ్రే లిస్టులో చేరితే వరల్డ్ బ్యాంకు నుంచి సాయం నిలిపివేయవచ్చు. ఇప్పటికే మే 9న తాజా పరిణామాలతో మళ్లీ గ్రే లిస్ట్‌లో చేర్చాలని భారత్ ఒత్తిడి తెస్తోంది. గ్రే లిస్ట్‌లో చేరితే వరల్డ్ బ్యాంక్ సాయం నిలిపివేయవచ్చు. ఇక మే 9న (IMF) (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) పాక్‌కు ఇచ్చిన 1 బిలియన్ యూఎస్ డాలర్లు బెయిలవుట్ ఇవ్వడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.






