Mana Enadu: టెస్టుల్లో ఇటీవల న్యూజిలాండ్(New Zealand) చేతిలో వైట్‌వాష్‌కు గురైన టీమ్ఇండియా(Team India) ఇంటాబయట ఘోరంగా విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్(Captain Rohit) శర్మ ఫామ్, మైదానంలో అతడి కెప్టెన్సీ వ్యూహాలు పేలవంగా సాగాయి. దీంతో భారత్ తొలిసారి న్యూజిలాండ్‌కు సొంతగడ్డపై సిరీస్‌ను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర పోరుకు కెప్టెన్ సూర్యకుమార్(Surya kumar) నేతృత్వంలోని భారత యువ జట్టు సిద్ధమైంది. సౌతాఫ్రికా(South Africa)తో నాలుగు 3T20 సిరీస్ కోసం రెడీ అయ్యింది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి T20 నేడు (Nov 8) డర్బన్ వేదికగా జరగనుంది. రాత్రి 8.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛనెల్‌లలో ప్రసారమవుతుంది. అలాగే మొబైల్‌లో Jio Cinema యాప్ ద్వారా లైవ్ మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
సఫారీ గడ్డపై అంత ఈజీ కాదు
అయితే సొంతగడ్డపై ఆ జట్టును ఎదుర్కొవడం భారత్‌కు అంత సులువు కాదు. టీమ్‌లోని చాలా మంది ఆటగాళ్లకు ఇదే తొలి దక్షిణాఫ్రికా పర్యటన కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకునే భారత ఆటగాళ్లు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్‌పై సెంచరీతో అదరగొట్టి సంజూ శాంసన్(Sanju Samson) ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశం ఉంది. అభిషేక్ శర్మతో కలిసి ఇండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తిలక్ వర్మకు తుది జట్టులో స్థానం దక్కనున్నట్లు సమాచారం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రింకు సింగ్ లాంటి బ్యాటర్లతో భారత మిడిల్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది. అటు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ మార్క్రమ్ నేతృత్వంలోని సఫారీ జట్టు బలంగా ఉంది.
మరో రికార్డుకు చేరువలో సూర్య
కాగా, ఇరు జట్లలో ఇప్పటి వరకు మొత్తం 27 T20 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 27 మ్యాచ్‌ల్లో 15 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 11 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. కాగా ఈ సిరీస్‌లో రాణిస్తే కెప్టెన్ సూర్య మరో రికార్డు సొంతం చేసుకోనున్నాడు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరిగిన టీ20ల్లో డేవిడ్ మిల్లర్ (452 పరుగులు)తో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డును అధిగమించడానికి భారత్ కెప్టెన్‌కి కేవలం 107 పరుగులు మాత్రమే అవసరం.
తుది జట్ల అంచనా
ఇండియా XI: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, విజయ్‌కుమార్ వైశాఖ్, అవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా XI: రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్ (C), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, న్కాబా పీటర్, ఒట్నీల్ బార్ట్‌మన్.
India Ready to Shine in South Africa – 1st T20! 🇮🇳🔥
Watch out for Suryakumar Yadav leading the charge and Hardik Pandya with his all-round brilliance! 🏏💪#INDvsSA #T20Cricket #TeamIndia #SupportIndia #CricketLove pic.twitter.com/4Y7FhZS68A
— Top 11 india ɪɴ (@Top11_india) November 8, 2024








