ఇంగ్లండ్(Englnad)తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు(First Test)లో భారత(India) బౌలర్లు చెమటోడ్చుతున్నారు. వికెట్లు పడగొట్టేందుకు కష్టపడుతున్నారు. దీంతో మూడో రోజు లంచ్(Day-3 Lunch) సమయానికి ఇంగ్లండ్ 327/5 రన్స్ చేసింది. ఆదివారం ఆట మొదలైన మూడో ఓవర్లోనే ప్రసిద్ధ్ కృష్ణ సెంచరీ హీరో ఓలీ పోప్(106)ను అద్భుత బౌన్సర్‌తో పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చి స్టోక్స్(20) సాయంతో బ్రూక్ (57*) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్ ఇంగ్లిష్ కెప్టెన్ స్టోక్స్(Stokes)ను ఔట్ చేసి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు.
𝐃𝐀𝐘 𝟑: 𝐋𝐔𝐍𝐂𝐇 𝐁𝐑𝐄𝐀𝐊 🍴
Team India grabs two wickets, but England added 118 runs in the morning session! 🇮🇳🤝🏴
Can India strike early in the next session? 🤔#ENGvIND #Tests #Leeds pic.twitter.com/TFxSLtjQdX
— Root Jaiswal (@JaiswalRoot) June 22, 2025
కానీ మరో ఎండ్‌లో బ్రూక్(Brook) వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒక సిక్స్, 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఎండ్‌లో జేమీ స్మిత్ (29) బ్రూక్‌కు సహకారమందిస్తున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో క్రాలీ 4, డకెట్ 62, పోప్ 106, రూట్ 28, స్టోక్స్ 20 రన్స్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్, ప్రసిద్ధ్ చెరో వికెట్ తీశారు. కాగా ఇంగ్లండ్ ఇంకా 144 రన్స్ వెనుకబడి ఉంది. ఈ మ్యాచులో భారత్ పట్టు సాధించాలంటే వీలైనంత త్వరగా ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయాల్సి ఉంది.






