బజ్‌బాల్(Buzz Ball) అంటూ విర్రవీగే ఇంగ్లండ్(England) క్రికెట్ జట్టుకు టీమ్ఇండియా(Team India) షాకిచ్చింది. రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో రికార్డు విక్టరీ సాధించిన గిల్ సేన.. లండన్‌లోని లార్డ్స్(Lord’s) వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో స్టోక్స్(Stokes) సేనకు అసలుసిసలైన పేస్ బౌలింగ్ రుచి చూపించింది. ఇటీవల కాలంలో బజ్ బాల్ పేరుతో టెస్టుల్లో ఎటాకింగ్ చేసే ఇంగ్లిష్ బ్యాటర్లు భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో చతికిలపడ్డారు. దీంతో ఎప్పుడూ చూడని ఆత్మరక్షణతో ఆడి తొలి ఇన్నింగ్స్ తొలి రోజును ముగించారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు మాత్రమే చేసింది.
44 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో..
టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు లార్డ్స్ పిచ్‌పై బ్యాటింగ్ అంత సులభంగా లేదు. భారత పేసర్లు(india pacers) కూడా పిచ్ అనుకూలతతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో తొలి రోజు ఇంగ్లండ్ బ్యాటింగ్ పూర్తిగా నిదానంగా సాగింది. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), డక్కెట్(23) నిదానంగా ఆడుతూ క్రీజులో పాతుకపోయేలా కనిపించారు. కానీ, నితీశ్ కుమార్(Nitish Kumar Reddy) ఒకే ఓవర్‌లో వారిద్దరిని అవుట్ చేసి షాకిచ్చాడు. దీంతో ఇంగ్లండ్ 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు మంచి అవకాశం దక్కింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జోరూట్(Joe Root) ఆతిథ్య జట్టుకు అండగా నిలిచాడు. ఓలీ పోప్(44)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.
Nitish Kumar Reddy taking wickets like “Maggy in two minutes”
Future of fast bowler in India in safe Hands
Jaspreet Bumrah, Mohmmad Siraz, Akash Deep also other three pillars in Indian Cricket Team pic.twitter.com/UzP6Y3jJw2
— श्री (@Virat_82) July 11, 2025
చెత్త రికార్డు నమోదు చేసిన ఇంగ్లండ్
అయితే, భారత బౌలర్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో రూట్, పోప్(Pope) పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితయ్యారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 109 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ నిదానంగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లను పరీక్షించారు. ఎట్టకేలకు పోప్‌ను జడేజా(Jadeja) అవుట్ చేసి ఈ జంటను విడదీశాడు. కాసేపటికే హ్యారీ బ్రూక్(11)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో వికెట్లు పడతాయని భావించినా అది జరగలేదు. స్టోక్స్(39*)తో కలిసి రూట్(99*) మరో జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే తొలి రోజును అజేయంగా ముగించారు. కాగా ఈ మ్యాచులో ఇంగ్లండ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్టుల్లో ఒక రోజులో అత్యత్పంగా 3.02 శాతంతో లో స్కోరింగ్ రేటు(Low Scoring Rate) నమోదు చేసింది.






