ఇంగ్లండ్(England) గడ్డపై జరగబోయే కీలక టెస్ట్ సిరీస్(Test Series) కోసం BCCI ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. కొందరు ఆటగాళ్లను ముందుగానే అక్కడికి పంపుతోంది. ఈ మేరకు టీమ్ఇండియా(Team India) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir), కొందరు ఆటగాళ్లతో కూడిన తొలి బృందం జూన్ 6న ఇంగ్లండ్‌కు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఆటగాళ్ల ప్రయాణం, IPL 2025 షెడ్యూల్‌ను బట్టి ఖరారు కానుంది. కాగా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ 5 టెస్టులు ఆడనుంది.
IPL లీగ్ దశ ముగిసిన వెంటనే..
భారత టెస్ట్ జట్టు సభ్యుల(Players of the Indian Test team) ఎంపిక ఇంకా జరగనప్పటికీ, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రయాణ షెడ్యూల్‌ను BCCI ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. “IPL లీగ్ దశ ముగిసిన వెంటనే అందుబాటులోకి వచ్చే ఆటగాళ్లు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు జూన్ 6న ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. మిగిలిన వారు ఐపీఎల్ కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాత కొద్దిపాటి విరామం తీసుకుని బయలుదేరుతారు” అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి(Senior BCCI Official) వెల్లడించారు.

మే 25 నుంచి విడతల వారీగా
మరోవైపు, India-A జట్టు కూడా ఇంగ్లండ్ పర్యటన(Engalnd Tour)కు వెళ్లనుంది. వీరి ప్రయాణం మే 25 నుంచి విడతల వారీగా ప్రారంభమవుతుంది. IPLలో భాగం కానివారు లేదా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించని జట్ల ప్లేయర్లు తొలి బృందంతో కలిసి వెళతారు. మిగిలిన వారు తర్వాత జట్టుతో కలుస్తారు. వాస్తవానికి ఇండియా ‘A’ జట్టును ఈ వారం మొదట్లోనే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, మారిన IPL షెడ్యూల్ కారణంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ(Selection Committee) తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది.






