Ind vs Aus: గబ్బా టెస్టులో దోబూచులాడుతున్న వరణుడు

Mana Enadu : గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో (Gabba Test) వరుణుడు దోబూచులాడుతున్నాడు. (Ind vs Aus) ఈ టెస్టుకు మొదటి నుంచి ఆటంకం కలిగిస్తున్న వర్షం.. మూడో రోజు ఏకంగా ఆరు సార్లు అడ్డుతగలగా, నాలుగో రోజు కూడా సవ్యంగా సాగనివ్వలేదు. ఇన్నింగ్స్​ ప్రారంభం తర్వాత, టీ బ్రేక్​ సమయానికి కూడా వర్షం అడ్డుతగిలింది. (Border Gavaskar Trophy) 51 ఓవర్​ తర్వాత ఎంపైర్లు ఆటను నిలిపివేశారు. కొద్దిసేపు వాన కురవడంతో గ్రౌండ్​ సిబ్బంది నీటిని తొలగించగా.. చాలా సేపటి తర్వాత నాలుగో సెషన్​ ప్రారంభమైంది. బ్యాటింగ్​ వైఫల్యంతో ఓటమి అంచున ఉన్న టీమిండియాకు వర్షం ఓరకంగా మంచే చేస్తోంది.

దంచికొట్టిన ఆసీస్​ బ్యాటర్లు

పెర్త్​లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దంచికొడితే.. అదే పిచ్​పై భారత బ్యాట్స్​మెన్​ తేలిపోయారు. రోహిత్ శర్మ (Rohit sharma​), విరాట్​ కోహ్లీ (Virat kohli) లాంటి స్టార్​ బ్యాటర్లు కొద్దిసేపు కూడ్రా క్రీజులో నిలవలేకపోయారు. ఆసీస్​ బౌలర్ల దెబ్బకు క్రీజు వదిలి పెవిలియన్​ చేరారు. రోహిత్​ 10 రన్స్​ మత్రమే చేయగా, కోహ్లీ 3 పరుగులకే కవర్​ డ్రైవ్​ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు. మొదటి టెస్టులో సెంచరీ హీరో యశస్వి జైస్వాల్​ సైతం విఫలమయ్యాడు. కేవలం 4 రన్స్​ మాత్రమే చేశాడు. శుభ్​మన్​ గిల్ (1)​, కీపర్​ రిషభ్​ పంత్ (9)​ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు.

ఒకే ఒక్కడు కేఎల్​.. తోడుగా జడేజా

ఓవైపు వికెట్లు కూలుతున్నా కేఎల్​ రాహుల్‌ (KL Rahul) ఒక్కడే పట్టుదల ప్రదర్శించాడు. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ క్రీజులో నిలిచాడు. ఆసీస్​ విధించిన 445 భారీ స్కోరు ముందుండగా సహనంతో క్రీజులో నిలదొక్కుకున్నాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఆకట్టుకున్నాడు. రోహిత్​ ఔట్​ అవడంతో క్రీజులోకి వచ్చిన జడేజాతో జట్టుకట్టి ఇన్నింగ్స్​ నడిపించాడు. 84 రన్స్​ చేసి లయన్​ బౌలింగ్​లో స్టీవ్​ స్మిత్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా సైతం ఆకట్టుకుంటున్నాడు. 60 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *