Mana Enadu : గబ్బా టెస్టుపై (AUS vs IND) ఆస్ట్రేలియా పట్టు సాధిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించేలా కనిపిస్తోంది. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో 400పై చిలుకు స్కోరు చేసి పటిష్ఠ స్థితికి చేరింది. ట్రావిస్ హెడ్ (Travis Head), స్టీవ్ స్మిత్ జోడీ నాలుగో వికెట్‌కు ఏకంగా 241 పరుగులు జోడించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (45), మిచెల్ స్టార్క్ (7) క్రీజులో ఉన్నారు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit bumrah)లేకుండా భారత్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదే. అతడు మరోసారి భారత్ బౌలింగ్ దళానికి వెన్నుముకలా నిలిచాడ. ఆసీస్ కోల్పోయిన 7 వికెట్లలో 5 వికెట్లు అతడే పడగొట్టాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అతడి కెరీర్లో ఇది 12వ సారి.
ఇదీ స్కోరు కార్డు
నాథన్ మెక్‌స్వీనీ (9), ఉస్మాన్ ఖవాజా (21), మార్నస్ లబుషేన్ (12), స్టీవ్ స్మిత్ (101), ట్రావిస్ హెడ్ (152), మిచెల్ మార్ష్ (5), అలెక్స్ కేరీ (45), ప్యాట్ కమిన్స్ (20), మిచెల్ స్టార్క్ (7). బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు.








