ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి T20లో సూపర్ విక్టరీ సాధించి ఊపుమీదున్న టీమ్ ఇండియా(Team India) రెండో T20కి సిద్ధమైంది. చెన్నై వేదికగా ఇవాళ జరుగుతున్న రెండో టీ20లో టాస్(Toss) గెలిచిన జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(SKY) బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో టీమ్ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గాయం కారణంగా నితీశ్ కుమార్ రెడ్డి(NKR) మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు. మరో ప్లేయర్ రింకూ సింగ్(Rinku Singh) ప్రాక్టీస్ సమయంలో గాయపడటంతో ఈ మ్యాచుకు అందుబాటులో లేడు. దీంతో వీరిద్దరి ప్లేస్‌లో ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. అటు ఇంగ్లండ్ జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. ఆట్కిన్సన్, బెథెల్ ప్లేస్‌లో జెమీ స్మిత్, కార్స్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు ఇవే..
India: సంజు శాంసన్(WK), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
England: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(WK), జోస్ బట్లర్(C), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
Toss – India opt to bowl in Chennai
Washington Sundar and Dhruv Jurel come in place of Nitish Reddy and Rinku Singh
Jacob Bethell and Gus Atkinson make way for Jamie Smith and Brydon Carse#INDvsENG pic.twitter.com/zP78YKFzT1
— Cricbuzz (@cricbuzz) January 25, 2025






