
నరాలు తెగే ఉత్కంఠ.. చివరి క్షణం వరకు పోటాపోటీ.. మ్యాచ్‌కు ముందే టెన్షన్ టెన్షన్.. ఇదీ దాయాదుల సమరం అంటే ఇదీ అన్నట్లు ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదంతా ఏ క్రీడకు సంబంధించో.. అదేనండీ ఇండియా వర్సెస్ పాకిస్థాన్(India vs Pakistan) క్రికెట్ గురించి. చాలారోజుల తర్వాత దాయాది జట్లు పోటీపడబోతున్నాయి. ఈనెలలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో మరోసారి నువ్వానేనా అన్నట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. మరో 14 రోజుల్లో (ఫిబ్రవరి 19 నుంచి) ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా భారత్-పాక్ మ్యాచుకోసం రెండు జట్లే కాదు.. అభిమాను(Fans)లూ రెడీ అయిపోయారు.
ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ పాకిస్థాన్(Pakistan)కే దక్కింది. అయితే భద్రతా కారణాల వల్ల భారత్ అక్కడ పర్యటించేందుకు ఒప్పుకోకపోవడంతో భారత్ ఆడే మ్యాచులను UAEలో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉండటం గమనార్హం. దీంతో గ్రూపు స్టేజీలోనే అభిమానులు ఫుల్ మాజాను ఆస్వాదించవచ్చన్నమాట. భారత్ తన తొలి మ్యాచ్ లో ఈ నెల 20న బంగ్లాదేశ్(BAN), 23న పాకిస్థాన్(PAK), మార్చి 2న న్యూజిలాండ్(NZ)తో ఆడుతుంది. వీటిలో ఏ రెండు మ్యాచ్‌లలో గెలిచినా భారత్ సెమీఫైనల్ చేరుతుంది. అప్పుడు సెమీస్(Semis) కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది.
*🚨 THE CRAZE OF INDIA vs PAKISTAN 🚨*
– The Tickets for India vs Pakistan Match in Champions Trophy 2025 have been sold out in less than one hour. (Indian Express).#ChampionsTrophy2025 #triseries #PAKvsIND pic.twitter.com/cLhYzJXnV9
— Cric Updates (@mubeena79427) February 5, 2025
దాదాపు 8 ఏళ్ల తర్వాత వన్డే ఫార్మాట్లో..
ఈ నేపథ్యంలో నిర్వాహకులు భారత్ మ్యాచ్‌ల టికెట్లను ఆన్‌లైన్(Tickets online)లో ఉంచారు. సాధారణ స్టాండ్ టికెట్ల ప్రారంభ ధర 125 UAE దిర్హమ్‌లు (సుమారు రూ.2,965)గా నిర్ణయించారు. ఇవి పెట్టిన వెంటనే భారత మ్యాచ్‌ల టికెట్లన్నీ హాట్ కేకుల్లా నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. అయితే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు దుబాయ్ స్పోర్ట్స్ సిటీ క్రికెట్ స్టేడియం(Dubai Sports City Cricket Stadium) ఆతిథ్యం ఇవ్వనుంది. దీని సామర్థ్యం 25 వేల సీట్లు. కానీ, ఆన్‌లైన్‌లో సుమారు 1,50,000 మంది పోటీపడ్డారట. కాగా ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.