ManaEnadu: భారత వికెట్ సీనియర్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్(retirement from all forms of cricket) ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ(Ranji Trophy) సీజన్ తన చివరి సీజన్ అని వృద్ధిమాన్ సోషల్ మీడియా(Social Media)లో పేర్కొన్నాడు. గత నెలలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ స్టంపర్ 40 టెస్టులు, 9 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. MS ధోని రిటైర్మెంట్ తర్వాత కొంతకాలం రెడ్ బాల్ క్రికెట్(Red ball cricket)లో అతను టీమ్ఇండియా(Team India)కు వికెట్ కీపర్‌గా సేవలందించాడు.
వారి రాకతో టీమ్‌లో చోటు గల్లంతు
కాగా ధోనీ(Dhoni), పంత్(Pant) తర్వాత భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన కీపర్‌లలో ఈ రైట్‌హ్యాండర్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ గ్లోవ్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడే సాహా, తన కెరీర్‌లో మూడు సెంచరీలతో 1353 టెస్ట్ పరుగులు చేశాడు. సాహా తన చివరి టెస్టులో మూడేళ్ల క్రితం అంటే 2021లో న్యూజిలాండ్(New Zealand)పై ఆడాడు. సిరీస్‌లో కొన్ని కీలకమైన నాక్‌లు ఆడినప్పటికీ, అప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid), కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)లతో కూడిన అప్పటి కొత్త టీమ్ మేనేజ్‌మెంట్, రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా KS భరత్‌పై దృష్టి సారించి సాహాను జట్టు నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది. దీంతో సాహా జట్టులో చోటు కోల్పోక తప్పలేదు.
మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: సాహా
“క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రయాణం తర్వాత, ఈ సీజన్ నాకు చివరిది. నేను రిటైరయ్యే ముందు రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడుతూ చివరిసారిగా బెంగాల్(Bengal)కు ప్రాతినిధ్యం వహించినందుకు గౌరవంగా భావిస్తున్నాను” అని సాహా (X)లో రాశాడు, బెంగాల్‌కు తన చివరి సీజన్‌ను చిరస్మరణీయమైనదిగా చేస్తానని వాగ్దానం చేశాడు. “ఈ అద్భుతమైన రైడ్‌లో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని సాహా రాసుకొచ్చాడు. కాగా వచ్చే IPLలోనూ సాహా ఆడే అవకాశాలు లేవు.
WRIDDHIMAN SAHA IS SET TO RETIRE FROM ALL FORMS OF CRICKET AT THE END OF RANJI SEASON 🇮🇳
– Thank you for the memories, Saha. pic.twitter.com/2yxD6O4PVh
— Johns. (@CricCrazyJohns) November 4, 2024








