ICC WT20 WC 2024: వరల్డ్‌కప్ కల నెరవేరేనా? నేడు న్యూజిలాండ్‌తో భారత్ ఢీ

ManaEnadu: మహిళల టీ20 ప్రపంచకప్(Women’s T20 World Cup-2024) అట్టహాసంగా ప్రారంభమైంది. యూఏఈ(UAE) వేదికగా జరుగుతోన్న ఈ మెగా టోర్నీలో భారత్(Team India) ఇవాళ తన తొలి మ్యాచ్ ఆడనుంది. బలమైన ఆలౌరౌండర్లు ఉన్న న్యూజిలాండ్(New Zealand) జట్టును దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(Dubai International Cricket Stadium) వేదికగా హర్మన్ సేన ఎదుర్కోనుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌‌ను డిస్నీ హాట్‌ స్టార్, స్టార్‌ స్పోర్ట్స్‌(Disney Hot Star, Star Sports)‌లో లైవ్ చూడవచ్చు. కాగా ఆరంభ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌(SCO)పై బంగ్లాదేశ్(BAN) 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్‌లో శ్రీలంక(SL)పై పాకిస్థాన్(PAK) 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.

 మెగా టోర్నీల్లో ఎప్పుడూ నిరాశే..

అయితే ICC మెగా టోర్నీల్లో ఇప్పటి వరకూ భారత్ మహిళల జట్టు ఏ ఫార్మాట్లోనూ ప్రపంచకప్‌(World Cup) సాధించలేదు. అయితే ఈసారి ఎలాగైన తమ కల నెరవేర్చుకోవాలని హర్మన్ ప్రీత్(Harman Preet) సేన ఆత్రుతగా ఎదురుచూస్తోంది. 2020 వరల్డ్‌కప్‌లో మొదటిసారి ఫైనల్స్‌ వరకూ చేరిన భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓడి త్రుటిలో విశ్వవిజేత కిరీటాన్ని చేజార్చుకుంది. 2023లో జరిగన ప్రపంచకప్ లోనూ భారత్ అదే కంగారూ(Australia) జట్టుపై సెమీస్‌లో ఓడింది. దీంతో గత ఎనిమిది సీజన్లుగా టీమ్ఇండియాకు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ప్రపంచకప్‌ ట్రోఫీని ఈసారి ఎలాగైన ఒడిసి పట్టేయాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది. ఓపెనర్లు మంధాన, షెఫాలీ వర్మపైనే భారత విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. వీరిద్దరూ రాణిస్తే భారత జట్టుకు తిరుగుండదని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

జట్లు వివరాలు

Team India: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన, యాస్తిక భాటియా (WK), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, డి హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజీవన్ సజన

New Zealand: సోఫీ డివైన్ (C), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇసాబెల్లా గాజ్ (WK), మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, జెస్ కెర్, అమేలియా కెర్, రోజ్మేరీ మెయిర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహు

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *