రూ.10కోట్లకుపైగా కుచ్చుటోపీ.. ఇండియన్ కపుల్స్‌కి 3 ఏళ్ల జైలుశిక్ష

న్యూజిలాండ్‌(New Zealand)లో భారత సంతతికి చెందిన నేహా శర్మ(Neha Sharma), అమన్‌దీప్ శర్మ(Amandeep Sharma) అనే దంపతులు అక్కడి ప్రభుత్వ శిశు సంక్షేమ సంస్థ ‘ఒరంగ తమరికీ(Oranga Tamariki)’కి భారీగా కుచ్చుటోపీ పెట్టారు. సుమారు 2 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు (రూ.10 కోట్లకు పైగా) మోసం చేసినట్లు వీరిపై ఆరోపణలు రుజువయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నేహా శర్మకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం(Court) తీర్పు వెలువరించింది. మోసం ద్వారా ఆర్థిక లబ్ధి పొందడం, మనీలాండరింగ్, నకిలీ పత్రాల వినియోగం వంటి పలు అభియోగాలను ఆమెతోపాటు భర్త అమన్‌దీప్ శర్మ అంగీకరించినట్లు సమాచారం.

అక్రమంగా కాంట్రాక్టులు..

వివరాల్లోకి వెళితే, నేహా శర్మ ‘ఒరంగ తమరికీ’ సంస్థలో ప్రాపర్టీ అండ్ ఫెసిలిటీస్(Property and Facilities) మేనేజర్‌గా పనిచేసేవారు. ఆమె భర్త అమన్‌దీప్ ‘Divine Connection’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను నడిపేవారు. నేహా శర్మ నకిలీ ఉద్యోగ ధృవపత్రాలను సమర్పించి 2021లో ఈ సంస్థలో చేరారు. తన అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని, భర్త కంపెనీకి అక్రమంగా కాంట్రాక్టులు(Contracts) కట్టబెట్టారు. 2021 జూలై నుంచి 2022 అక్టోబరు మధ్య కాలంలో, సుమారు 200కు పైగా నిర్వహణ పనులను, 326 పెంచిన ధరలతో కూడిన ఇన్వాయిస్‌లను భర్త కంపెనీకి మళ్లించారు. తామిద్దరూ భార్యాభర్తలమన్న విషయాన్ని సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకురాకుండా ప్రయోజనాల వైరుధ్యం నిబంధనలను ఉల్లంఘించారు.

The corrupt official, the director and the $2 million Oranga Tamariki scam  | The Press

ఒకే కాంట్రాక్టర్‌కు పదేపదే పనులు

2022 అక్టోబరులో ఒకే కాంట్రాక్టర్‌కు పదేపదే పనులు అప్పగించడంపై అనుమానం రావడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విచారణకు హాజరు కావాల్సి ఉండగా, దంపతులిద్దరూ వ్యాపార తరగతి విమానంలో చెన్నై(Chennai)కి పారిపోయారు. అయితే, కొద్దికాలంలోనే వారిని పట్టుకుని న్యూజిలాండ్‌కు రప్పించారు. వారి వద్ద 3 ఆస్తులు, 3 కార్లు, బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *