భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్((Sarfaraz khan) ఇటీవల తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి ఒక్కసారిగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సుమారు 10 కిలోల వరకు బరువు (10kg weight loss)తగ్గడంతో అంతా షాక్ అయ్యారు. అందుకు క్రమశిక్షణతో కూడిన ఆహారం, కఠోరమైన శిక్షణ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో, ముఖ్యంగా ఇంగ్లాండ్ (England tour) వంటి దేశాలలో రాణించాలంటే మెరుగైన ఫిట్‌నెస్ అవసరమని గ్రహించిన సర్ఫరాజ్.. ఉడికించిన కూరగాయలు, చికెన్‌తో కూడిన కఠినమైన డైట్‌ను ఫాలో అయినట్లు తెలిసింది.
అధిక బరువుతో హేళన..
గతంలో బరువు ఎక్కువగా ఉన్నాడనే విమర్శలు ఎదుర్కొన్న సర్ఫరాజ్(Sarfaraz), ఇప్పుడు తన ఆటతీరుతో పాటు శారీరక ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడంపై శ్రద్ధ పెట్టాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలనే అతని లక్ష్యంలో భాగం. సర్ఫరాజ్ తదుపరి కర్తవ్యం ఇంగ్లాండ్ పర్యటనలో ఇండియా A జట్టు తరపున ఆడటం. అక్కడ జరిగే అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లలో తన సత్తాను నిరూపించుకోవడం ద్వారా భారత సీనియర్ టెస్ట్ జట్టులో చోటు సంపాదించాలని అతను దృఢ నిశ్చయంతో ఉన్నాడు.
View this post on Instagram
కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్..
సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ(Virat Kohli),రోహిత్ శర్మ(Rohit Sharma) రిటైర్‌మెంట్లతో జట్టులో ఏర్పడిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ పర్యటన అతనికి చాలా కీలకం. ఆఫ్-స్టంప్ వెలుపల బంతులను ఎదుర్కోవడం వంటి తన ఆటలోని మెలకువలను మెరుగుపరచుకోవడానికి కూడా తీవ్రంగా సాధన చేస్తున్నాడు సర్ఫరాజ్. ఇదిలాఉండగా, అతని కృషికి తగ్గ ఫలితం లభించి, అతను త్వరలోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇంగ్లాండ్ పర్యటన కీలకం..
ఇప్పటివరకు సర్ఫరాజ్ ఖాన్ తన టెస్ట్ కెరీర్‌లో 6 మ్యాచ్‌లు ఆడగా.. 37.10 సగటుతో 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ మరియు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెంగళూరులో న్యూజిలాండ్‌పై అతను చేసిన 150 పరుగులు అతని అత్యుత్తమ టెస్ట్ స్కోరు.తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధ సెంచరీలు సాధించి మంచి ఆరంభాన్ని అంచ్చినప్పటికీ, ఆ తర్వాత నిలకడగా రాణించడంలో తడబడ్డాడు.కానీ, దేశవాళీ క్రికెట్‌లో అతని గణాంకాలు చాలా పటిష్టంగా ఉన్నాయి.ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్న సర్ఫరాజ్, భవిష్యత్తులో భారత టెస్ట్ జట్టులో తన స్థానాన్ని పదిలపరచుకోవాలని ఆశిస్తున్నాడు.






