India vs Pakistan: ఇండియా-పాక్ క్రీడా సంబంధాలపై కేంద్రం న్యూ పాలసీ

భారత్-పాకిస్థాన్ క్రీడా సంబంధాల(India and Pakistan sports relations)పై భారత క్రీడా మంత్రిత్వ శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రీడా ఈవెంట్‌ల(Bilateral sporting event)ను నిషేధిస్తూ, అంతర్జాతీయ బహుపాక్షిక టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి అనుమతిస్తోంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 2025లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి(Pahalgham Terror Attack) నేపథ్యంలో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత్ ‘ఆప్రేషన్ సిందూర్(Operation Sindoor)’ను చేపట్టిన విషయం తెలిసిందే.

ద్వైపాక్షిక సిరీస్‌లకు అనుమతించం

కొత్త విధానం ప్రకారం, భారత జట్లు పాకిస్థాన్‌(Pakistan)లో జరిగే ద్వైపాక్షిక క్రీడా పోటీలలో పాల్గొనవు. అలాగే పాకిస్థాన్ జట్లు భారత్‌లో ద్వైపాక్షిక ఈవెంట్‌లలో ఆడటానికి అనుమతించేది లేదు. అయితే, ఆసియా కప్(Acia Cup 2025) వంటి బహుపాక్షిక టోర్నమెంట్‌లలో రెండు దేశాల జట్లు పాల్గొనవచ్చు. ఈ విధానం ఒలింపిక్ చార్టర్‌కు అనుగుణంగా ఉంటుంది. ఇది రాజకీయ కారణాలతో పాల్గొనడాన్ని నిషేధిస్తుంది. భారత్ 2036 ఒలింపిక్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్‌(Commonwealth Games)ను ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ విధానం భారత్‌ను అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడంపై దృష్టి సారిస్తుంది.

It is time to recalibrate our policy towards India, writes Pakistani analyst

యూఏఈ వేదికగా ఆసియా కప్

షెడ్యూల్ ప్రకారం, T20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్(Dubai), అబుదాబి(Abudabi) నగరాల వేదికగా జరగనుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్, సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది. అంతకుముందు సెప్టెంబర్ 10న UAEతో, సెప్టెంబర్ 19న ఒమన్‌తో భారత్ తన గ్రూప్ మ్యాచ్‌లను ఆడనుంది. రాజకీయ కారణాల వల్ల BCCI ఆతిథ్య హక్కులు కలిగి ఉన్నప్పటికీ, ఈ టోర్నమెంట్‌ను పూర్తిగా యూఏఈలో నిర్వహిస్తున్నారు. 2012-13 తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *