
భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి(Koneru Humpy) సరికొత్త చరిత్ర సృష్టించింది. జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్(FIDE Women’s World Cup 2025)లో హంపి సెమీస్‌కు చేరుకుంది. దీంతో వరల్డ్ కప్‌లో సెమీస్(Semis)లో అడుగుపెట్టిన తొలి ఇండియన్‌గా ఘనత సాధించింది. ఆదివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్(Quarter-final)లో ఆమె 1.5-0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్(Yuxin Song)పై విజయం సాధించింది. రెండు క్లాసికల్ గేముల్లో హంపి తొలి గేము నెగ్గి విజయానికి చేరువైంది. యుక్సిన్‌తో జరిగిన రెండో గేమును హంపి డ్రా చేసుకుంది.
సెమీస్‌లో చైనా ప్లేయర్‌తోనే హంపి పోరు
ఈ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన భారత గ్రాండ్ మాస్టర్ 53 ఎత్తుల్లో పాయింట్స్ పంచుకుంది. కాగా సెమీస్(Semis)లో హంపి చైనాకు చెందిన లీ టింగ్జీ(Li Tingzhi)తో తలపడనుంది. మరోవైపు, మరో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. క్వార్టర్స్‌లో రెండో గేమును చైనాకు చెందిన టాంగ్ జోంగి చేతిలో కోల్పోవడంతో మ్యాచ్‌ను 1.5-0.5తో ఓడిపోయింది. ఇక, దివ్య దేశ్‌ముఖ్, ద్రోణవల్లి హారిక(Dronavalli Harika) మధ్య జరిగిన గేమ్ క్వార్టర్స్ ట్రై బ్రేకర్‌కు వెళ్లింది. తొలి గేమును డ్రా చేసుకున్న వీరు రెండో గేములోనూ పాయింట్స్ పంచుకున్నారు. నేడు టై బ్రేకర్ జరగనుంది.
Quarterfinal Game 2 results
GM Tingjie Lei🇨🇳 – GM Nana Dzagnidze🇬🇪 : 1-0
IM Yuxin Song🇨🇳 – GM Koneru Humpy🇮🇳 : 0.5-0.5
GM Harika Dronavalli🇮🇳 – IM Divya Deshmukh🇮🇳 : 0.5-0.5
GM Zhongyi Tan🇨🇳 – GM R Vaishali🇮🇳 : 1-0📷FIDE/Anna Shtourman pic.twitter.com/XV9zEaDlSx
— ChessBase India (@ChessbaseIndia) July 20, 2025