పాక్ భూభాగంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసి దాడి చేసే మిలిటరీ సామర్థ్యం(Military capability) భారత్‌కు ఉందని ఆర్మీ అధికారి లెఫ్టెనెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డీకున్హా(Lieutenant General Sumer Ivan DeCunha) అన్నారు. తాజాగా ఆయన ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. యావత్ పాకిస్థాన్(Pakistan) మన దాడుల పరిధిలోనే ఉందని పేర్కొన్నారు. ఓ పెద్ద గొయ్యి తవ్వుకుని అందులో దాక్కోవడం మినహా దాయాదికి మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు.
అన్ని ప్రాంతాలు మన ఆయుధాల పరిధిలోనివే..
‘యావత్ పాక్‌లో ఏ చోటునైనా టార్గెట్ చేసుకునే ఆయుధ సంపత్తి భారత్‌కు ఉంది. మొత్తం పాకిస్థాన్ మన పరిధిలో ఉంది. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను రావల్పిండి నుంచి మూలన ఉన్న ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వాకు మార్చినా తప్పించుకోలేరు. అన్ని ప్రాంతాలు మన ఆయుధాల పరిధిలోనివే’ అని పేర్కొన్నారు.
Samita: There’s talk in Pakistan about relocating their GHQ from Rawalpindi—apparently it’s too close to the border for comfort.
Lt. Gen. Sumer Ivan D’Cunha: Let them move it to KPK or anywhere else—they’re still well within our strike range. They’d need to dig a pretty deep… pic.twitter.com/0OOiu0V01z
— Times News Updates (@TheDailyUpdatee) May 20, 2025
800 నుంచి 1000 డ్రోన్స్ ప్రయోగించిన పాక్
ఇటీవల యుద్ధం జరిగిన నాలుగు రోజుల్లో పాకిస్థాన్.. భారత పశ్చిమ సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ 800 నుంచి 1000 వరకూ డ్రోన్స్(Drones)ను ప్రయోగించిందని డీకున్హా తెలిపారు. వాటన్నిటినీ భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు సంయుక్తంగా మార్గమధ్యంలోనే విజయవంతంగా ధ్వంసం చేశాయని వెల్లడించారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాక్‌లోని టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. ప్రధాన ఉగ్రవాదులను మట్టుపెట్టింది.








