Indian Navy: భారత నేవీ అమ్ములపొదిలోకి మరో రెండు వార్ షిప్స్

భారత నావికాబలం(Indian Navy) మరింత రెట్టింపు కానుంది. వైజాగ్(Visakhapatnam) తీరంలో ఈరోజు (ఆగస్టు 26) ఉదయగిరి, హిమగిరి అనే యుద్ధనౌకలు నావికాదళంలో చేరనున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) ఈ వార్ షిప్‌(Warships)లను జాతికి అంకితం చేయనున్నారు. ఈ విషయాన్ని నావికాదళ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఉదయగిరి (F​–35), హిమగిరి (F–34)లను ప్రధాని మోదీ(PM Modi) ‘మేక్​ ఇన్​ ఇండియా(Make In India), ఆత్మనిర్భర్​ భారత్​’ పిలుపులో భాగంగా రూపొందించారు. ప్రాజెక్ట్ 17–ఎ స్టెల్త్ ఫ్రిగేట్లలోని రెండో నౌక అయిన ఉదయగిరిని ముంబైలోని మజ్​ గాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL​) నిర్మించింది.

INS Udaygiri: Indian Navy receives advanced P17A stealth warship - The  Statesman

దాదాపు 6,700 టన్నుల బరువు

కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) నిర్మించిన P–17A నౌకలలో హిమగిరి మొదటిది. ఉదయగిరి నావల్ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక. ఈ యుద్ధనౌకల్లో అత్యాధునిక, సూపర్​ సోనిక్​ ఆయుధాలను ఉంచనున్నారు. దాదాపు 6,700 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌకలు శివాలిక్‌-క్లాస్‌ ఫ్రిగేట్స్‌ కంటే దాదాపు ఐదుశాతం పెద్దవి.

INS Udaygiri Delivered Under Project 17A: India's Advanced Stealth Frigate

తూర్పు నౌకాదళంలో ప్రధాన కేంద్రంగా విశాఖ

ఈ రెండింటి ఆయుధాల భాగంలో సూపర్‌సోనిక్‌ సర్ఫేస్‌-టు-–సర్ఫేస్‌ క్షిపణులు, మీడియం రేంజ్‌ సర్ఫేస్‌-టు-ఎయిర్‌ క్షిపణులు, 76MM MR గన్స్‌తో పాటు యాంటీ–సబ్‌మెరైన్‌/అండర్‌వాటర్‌ వెపన్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. భారతీయ నౌకాదళ పటిష్ఠత, సత్తాని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమాన్ని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నేవీ అధికారులు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *