Stocks Today: కలిసొచ్చిన మోదీ ఇండిపెండెన్స్ డే ప్రకటన.. స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

వస్తు, సేవల పన్ను (GST)లో రాబోయే సంస్కరణలపై సానుకూల అంచనాలతో భారత స్టాక్ మార్కెట్లు(Indian stock markets) మంగళవారం (ఆగస్టు 19) భారీ లాభాలను నమోదు చేశాయి. ఆటో, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో పెట్టుబడిదారుల(Investors) సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా, దేశీయ సూచీలు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, BSE సెన్సెక్స్ 676.09 పాయింట్లు లాభపడి 81,273.75 వద్ద స్థిరపడింది. ఉదయం సెషన్ భారీ గ్యాప్-అప్‌తో 81,315.79 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, ఒక దశలో 81,765.77 వద్ద గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. అటు NSE నిఫ్టీ 245.65 పాయింట్లు పెరిగి 24,876.95 వద్ద ముగిసింది.

బూస్టింగ్ ఇచ్చిన అమెరికా-రష్యా అధినేతల సమావేశం

స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రధాని జీఎస్టీ తగ్గింపు ప్రకటన, ప్రతిపాదిత GST హేతుబద్ధీకరణ దేశీయ మార్కెట్లకు సెంటిమెంట్ బూస్టర్‌గా పనిచేసిందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్(Geojit Investments Research) హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. దీనికి తోడు, అమెరికా-రష్యా శిఖరాగ్ర సమావేశం(US-Russia summit) ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ముగియడం కూడా పెట్టుబడిదారుల ఆందోళనను తగ్గించిందని ఆయన వివరించారు. 2026 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో డిమాండ్ పుంజుకుని, వినియోగ ఆధారిత రంగాలు రాణిస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ఆటోమొబైల్ రంగం ప్రధాన లబ్ధిదారుగా నిలిచింది.

ఏ సూచీలు లాభపడ్డాయంటే..

నిఫ్టీ ఆటో ఇండెక్స్(Auto index) ఏకంగా 1,008 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫిన్ సర్వీసెస్(Nifty Fin Services), నిఫ్టీ ఎఫ్‌ఎం‌సీజీ సూచీలు కూడా లాభపడ్డాయి. అయితే, నిఫ్టీ ఐటీ మాత్రం నష్టాల్లో ముగిసింది. విశాల మార్కెట్లలోనూ ఇదే ధోరణి కనిపించగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు(Smallcap indices) కూడా 1 శాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) షేర్లు ప్రధాన లాభాల్లో ఉండగా.. ఐటీసీ, టెక్ మహీంద్రా, ఎల్&టీ, ఇన్ఫోసిస్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఇదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు బలపడి 87.31 వద్ద ముగిసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *