భారత క్రికెట్ జట్టు(Team India) బంగ్లాదేశ్(Bangladesh)లో ఆగస్టు 2025లో జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్ వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌కు వాయిదా(Postpone) వేస్తూ రెండు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు T20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో రద్దీ, రాజకీయ అస్థిరత(Political instability), భద్రతా ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతల వల్లే..
గత ఏడాది బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం(Sheikh Hasina’s government) కూలిపోవడంతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి, ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు(Tensions in bilateral relations) ఈ వాయిదాకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగి, స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ టూర్‌ను నిర్వహించాలని BCCI భావిస్తోంది. ఈ సిరీస్ ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP)లో భాగంగా ఉంది.
BCCI, #Bangladesh cricket board agree to postpone India-Bangladesh white-ball series to September 2026 #Cricket pic.twitter.com/wDHSlskxfs
— DD News (@DDNewslive) July 5, 2025
వారిద్దరూ అక్టోబర్ వరకూ వేచి ఉండాల్సిందే..
ఈ వాయిదా వల్ల రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)లాంటి సీనియర్ ఆటగాళ్ల అభిమానులకు నిరాశే మిగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) తర్వాత వీరు వన్డే క్రికెట్‌లో తిరిగి కనిపించాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారు అక్టోబర్‌లో ఆస్ట్రేలియా టూర్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 2026లో భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తుందని ఆశతో ఉంది. కాగా సిరీస్ షెడ్యూల్, తేదీలను త్వరలో ప్రకటిస్తామని బీసీబీ తెలిపింది.







