
ఐటీ రంగంలో నియామకాల విషయంలో ఆందోళన నెలకొన్న సమయంలో, ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ( Capgemini) ఇండియా జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారత్(India’s Top Hiring)లో 40,000 నుంచి 45,000 ఉద్యోగాలను కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో 35-40 శాతం లేటరల్ హైయరింగ్స్ ఉంటాయని క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డీ(CEO Sshwin Yardi) వెల్లడించారు.
ప్రస్తుతం భారత్‌లో 1.75 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఈ కంపెనీ, దేశీయ కార్యకలాపాలపై మరింత దృష్టి కేంద్రీకరిస్తోంది. ఖాతాదారులు ఖర్చు తగ్గింపు, ఎక్కువ సామర్థ్యం కోరుతున్నందున, భారత్‌లో క్యాప్‌జెమినీకి భారీ అవకాశాలు లభిస్తున్నాయని అశ్విన్ తెలిపారు.
అలాగే, సంస్థకు ఇప్పటికే 50కి పైగా కళాశాలలు, క్యాంపస్‌లతో ఒప్పందాలు ఉన్నాయని, ఈ సీజన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆయన వివరించారు. ఈ కొత్త ఉద్యోగాల్లో కృత్రిమ మేధ (AI) సామర్థ్యాలు కలిగిన అభ్యర్థులే ప్రాధాన్యత పొందనున్నారు.
డబ్ల్యూఎన్‌ఎస్ కొనుగోలు.. వ్యూహాత్మక ముందడుగు
ఇటీవల క్యాప్‌జెమినీ డబ్ల్యూఎన్‌ఎస్ (WNS) అనే బిపిఎం సంస్థను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు గతంలో చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం వ్యాపార ప్రక్రియ నిర్వహణ సేవలలో కీలక స్థానం సంపాదించుకుంది. ఈ డీల్ విలువ సుమారుగా 330 కోట్ల డాలర్లు (భారత రూపాయల్లో రూ. 28,250 కోట్లు) కాగా, ఒక్కో షేరు ధరను $76.5గా కంపెనీ ప్రకటించింది.
ఈ రెండు సంస్థలు భారత్‌లో విస్తృత కార్యకలాపాలతో, కలిపితే సుమారు 2 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. డబ్ల్యూఎన్‌ఎస్‌ను సొంతం చేసుకోవడం ద్వారా క్యాప్‌జెమినీ భారత్‌లో తన స్థావరాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది.